Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఎన్టీఆర్ బిగ్ బాస్..బిగ్ సక్సెస్

ఓ వైపు విమర్శలు. మరో వైపు వెటకారాలు. ఈ షో ఏందిరా..బాబూ. అసలు ఇందులో ఎన్టీఆర్ ఎందుకు చేస్తున్నాడు. ఈ షో తో పరువు పొగొట్టుకుంటున్నాడు. వాళ్ళను తీసేయండి..వీళ్ళను తీసేయండి. ఆ ఏడుపులు ఏందిరా ..నాయనా? ఇవీ నిత్యం బిగ్ బాస్ షో..సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న కామెంట్లు. ఇదంతా ఒకెత్తు…అసలు విషయం మరో ఎత్తు. ఎవరికి నచ్చుతుందో..ఎవరికి నచ్చదో అది వాళ్ల టేస్ట్. దాన్ని తప్పు పట్టాల్సిన పని ఏ మాత్రం లేదు. నచ్చిన వాళ్లు చూస్తారు..నచ్చని వాళ్లు అసలు అటువైపు రారు. కానీ అసలు విషయం ‘మా’ చెప్పేసింది. ఎన్టీఆర్ చేస్తున్న షో బిగ్ బాస్…బిగ్ సక్సెస్ అని. సహజంగా సక్సెస్ ను కొలిచేది టీఆర్పీలతోనే.

                        అదే ఇది. బిగ్ బాస్ లాంటి  షో తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో అన్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ రికార్డ్ టీఆర్పీలను సాధించింది. తారక్ ఫ్యాన్స్ తో పాటు రియాల్టీ షో అభిమానులు కూడా ఈ షోను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోనే ప్రసారం చేస్తున్న స్టార్ మా ఛానల్ టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోయింది. ముఖ్యంగా వారాంతంలో ఎన్టీఆర్ కనిపించే ఎపిసోడ్స్ లో రేటింగ్ భారీగా ఉంటోందని సమాచారం. స్టార్ మా ప్రకటించిన అధికారిక సమాచారం ప్రకారం టీఆర్ఫీ 16.18 గా నమోదైంది.ఇటీవల కాలంలో ఒక ఛానెల్ కు ఇంతటి టీఆర్ఫీ రాలేదు. ఇన్నాళ్లు నాలుగోస్థానంలో ఉన్న స్టార్ మా బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన తరువాత మొదటి స్థానానికి రావటం విశేషం.

The post ఎన్టీఆర్ బిగ్ బాస్..బిగ్ సక్సెస్ appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Tollywood Actress HD Wallpapers, please read the originial post: here

Share the post

ఎన్టీఆర్ బిగ్ బాస్..బిగ్ సక్సెస్

×

Subscribe to Tollywood Actress Hd Wallpapers

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×