Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రాత్రి రాజీనామా…పొద్దున్నే సీఎం పదవి

Tags: agravedeg

ఇదీ బీహార్ రాజకీయం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ తనయుడు తేజస్విని యాదవ్ ను పదవి నుంచి తప్పించటంలో విఫలమైన సీఎం నితీష్ కుమార్ ఏకంగా తానే సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో తేజస్వితో పాటు అందరి పదవులు పోయాయి. నిన్నటివరకూ ఆర్జేడీ..కాంగ్రెస్ సంకీర్ణంలో సీఎంగా ఉన్న నితీష్ కుమార్…గురువారం నాటికి జెడీ యూ…బిజెపిల సంకీర్ణంలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో ఎప్పుడైనా..ఏమైనా జరగొచ్చు అనేదానికి ఇదే ఓ పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. శరవేగంగా మారిన బీహార్ రాజకీయాల్లో అన్ని చకచకా ముందుకు సాగిపోయాయి.   దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే నితీష్ కుమార్ మరోసారి బీహార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

                               రాష్ట్ర గవర్నర్‌ త్రిపాఠీ ఈ రోజు ఉదయం 10 గంటలకు   నితీశ్‌ కుమార్‌తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోదీ కూడా ప్రమాణం చేశారు. ప్రస్తుతానికి వీరిద్దరే ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు నితీశ్‌ కు మద్దతు ఇస్తామని బీజేపీ ప్రకటించిన బీజేపీ ఈ మేరకు గవర్నర్‌కు లేఖ కూడా అందచేసిన విషయం విదితమే. జెడీయూ..బిజెపిలకు  అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే కొంత కసరత్తు తర్వాత మిగతా మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది.

The post రాత్రి రాజీనామా…పొద్దున్నే సీఎం పదవి appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Tollywood Actress HD Wallpapers, please read the originial post: here

Share the post

రాత్రి రాజీనామా…పొద్దున్నే సీఎం పదవి

×

Subscribe to Tollywood Actress Hd Wallpapers

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×