Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మన స్కామ్ లు దాచెేయ్…పక్కోడి మీద రాళ్లెయ్..ఇదీ ఎన్టీవీ మోడల్

ఛానల్ ఉంటే చాలు పక్కోడి మీద ఏదైనా పడేయోచ్చు. మన మీదకు ఎవరూ రాకుండా  చూసుకోవచ్చు. ఇది ఎన్టీవీ మోడల్. అదే సమయంలో మన తప్పులు ప్రశ్నించే వారు ఎవరూ ఉండరు కదా..అందుకే ఏమైనా నీతులు చెప్పేయోచ్చు. ఛానల్ పాపులారిటీ  కోసం ఒకప్పుడు అర్థరాత్రి అచ్చమైన బూతు కార్యక్రమాలు నడిపి..సభ్య సమాజానికి గొప్ప సందేశం ఇచ్చిన ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి తన ఛానల్ ద్వారా కొద్ది రోజుల క్రితం  మిగిలిన ఛానళ్ళ బూతు కార్యక్రమంపై  యుద్ధం చేస్తానని ప్రకటించాడు. అది చూసిన వారంతా నవ్వుకున్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఛైర్మన్ గా ఉన్న సమయంలో భారీ ఎత్తున  కబ్జాలకు పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని విజిలెన్స్ విభాగం తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వంలోని పెద్దలపై ఒత్తిడి ద్వారా ఈ కేసు బయటకు రాకుండా తొక్కి పెట్టించుకుంటున్నారు. నిజంగా అదే బయటికి వస్తే ఆయన కూడా చిక్కుల్లో పడేవాళ్ళే.

                            కానీ ఇప్పుడు ఛానల్ రేటింగ్ పరంగా ఓ రేంజ్ లో ఉన్నందున ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు కూడా దాన్ని ఓ అస్త్రంగా పెట్టుకుని తమ పనికానిచ్చేసుకుంటున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో ఎన్టీవీ తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. జర్నలిజంతో ఏ మాత్రం సంబంధం లేని యాజమానులు ఛానళ్లు పెడితే ఇలానే ఉంటుందేమో అన్పించేలా ఉన్నాయి ఈ కార్యక్రమాలు. ఎన్టీవీ ఒక్కటే అలా చేస్తుందా? అంటే మిగిలిన  కొన్ని ఛానళ్ళూ అదే మోడ్ లో ఉన్నా..ఇక్కడ డోస్ కాస్త ఎక్కువైంది. దానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. శనివారం నాడు సిట్ ముందు విచారణకు హాజరైన హీరో తరుణ్ ఏ ఫ్యాంటు వేసుకున్నాడు…ఏ షర్టు వేసుకున్నాడో కూడా టీవీలో చెప్పేశారు. అదృష్టవశాత్తు అండర్ వేర్ కలర్ జోలికి వెళ్ళలేదు.

The post మన స్కామ్ లు దాచెేయ్…పక్కోడి మీద రాళ్లెయ్..ఇదీ ఎన్టీవీ మోడల్ appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

మన స్కామ్ లు దాచెేయ్…పక్కోడి మీద రాళ్లెయ్..ఇదీ ఎన్టీవీ మోడల్

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×