Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Telguu Comedy Dharidhram Jokes Sms

#జీవితంలో_కొన్ని_అంతే

#చేతికి ఆయిలో , గ్రీజో అంటుకున్నప్పుడే వీపు‌ దురదపెడుతుంది.

#స్నేహితులతో షికారుకి వెళ్దామనుకున్నప్పుడే అమ్మో , నాన్నో ఏదో ఒక పని చెప్తారు.

#నిలుచున్న క్యూ కదలడం లేదని , పక్క క్యూ లో కి వెళితే మొదటిది త్వరగా కదులుతుంది.

#స్నానం చేస్తున్నప్పుడే కాలింగ్ బెల్ నో , ఫోన్ నో మోగుతుంది.

#అర్జంటుగా బయటకి వెళ్లాలనుకున్నప్పుడే కావాల్సిన బస్సు రాదు .

#సమాధానం తెలియని ప్రశ్నకే క్లాసులో జవాబు చెప్పే అవకాశం వస్తుంది.

#ఆఫీసుకి ఆలస్యంగా వెళ్లినప్పుడే బాస్ ఆరోజు త్వరగా వస్తారు.

#ఇష్టమైన ప్రోగ్రాం చూస్తున్నప్పుడే కరెంటు పోతుంది.

#ఏదైనా వస్తువు పనిచెయ్యడం లేదని , మెకానిక్ దగ్గరకు తీస్కెళ్లాక అక్కడ సరిగా పనిచేస్తుంది.

#ఇంటినుండి దూరంగా వచ్చాకనే మొబైల్ మర్చిపోయామని గుర్తొస్తుంది.

#చేతిలోనుండి జారిన వస్తువు మనకి అందని చోటులో పడుతుంది.

#పోస్ట్ బాక్స్ చూసినప్పుడే , లెటర్ పోస్ట్ చెయ్యాలన్న సంగతి గుర్తొస్తుంది.

#ఇంట్లో సరుకులు నిండుకున్నప్పుడే ఇంటికి బంధువులు వస్తారు



---------------------------------------------------------------------------------------------
నిన్న మిగిలిన వంకాయ కర్రీ olx లో పెడితే ఇప్పటివరకు ఎవరూ కొంటానికి రాలేదు. టీవీ లో మాత్రం olx లో పెట్టండి చిటికలో అమ్మేయండి అని యాడ్లు మాత్రం తెగ ఇస్తారు


This post first appeared on తెలుగు ఫన్నీ SMS-Telugu Funny Sms, please read the originial post: here

Share the post

Telguu Comedy Dharidhram Jokes Sms

×

Subscribe to తెలుగు ఫన్నీ Sms-telugu Funny Sms

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×