Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘గేమ్ ఓవర్ ’ మూవీ రివ్యూ

తాప్సీ. ఒకప్పుడు టాలీవుడ్ లో రొటీన్ పార్ములా సినిమాలు చేసిన హీరోయిన్. తర్వాత ఎందుకో కానీ వాటికి గుడ్ బై చెప్పి బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అంతే కాదు..అక్కడ ఎన్నో హిట్స్.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అడపాదడపా తెలుగు తెరపై కూడా దర్శనం ఇస్తోంది. అది కూడా ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతోనే. తాజాగా ఆమె కీలకపాత్రలో నటించిన ‘గేమ్ ఓవర్’ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా తాప్సీ మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ సినిమా ఫస్టాఫ్ లో కాస్త స్లోగా నడిచినా…తర్వాత గ్రిప్పింగ్ గానే లాగించాడు దర్శకుడు అశ్విన్. ఇందులో ఓ విశేషం కూడా ఉంది. థ్రిల్లర్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ కూడా జోడించటం ఓ కొత్త మార్పు అని చెప్పకతప్పదు. గేమ్ ఓవర్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు.

ఇక సినిమా విషయానికి వస్తే దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌, రచయిత కావ్య గేమ్‌ ఓవర్ సినిమాను ఓ వీడియో గేమ్‌ లాగే మలిచారు. సెన్సిబుల్‌ ఇ‍ష్యూస్‌ను టచ్‌ చేస్తూనే థ్రిల్లింగ్‌ ఎక్స్‌ పీరియన్స్‌ కలిగించారు. అశ్విన్‌, కావ్యలు అందించిన స్క్రీన్‌ప్లేనే సినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు. గత కొంత కాలంగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాల మీద దృష్టి పెట్టిన తాప్సీ గేమ్‌ ఓవర్ సినిమాతో సౌత్‌లో సక్సెస్‌ కోసం ప్రయత్నించారు. స్వప్న పాత్రకు తనదైన నటనతో ప్రాణంపోశారు. లుక్‌, యాక్షన్‌, ఎమోషన్స్‌ ఇలా ప్రతీ విషయంలో పర్ఫెక్షన్‌ చూపించిన తాప్సీ సినిమాను తన భుజాల మీదే నడిపించారనే చెప్పాలి.

మరో కీలక పాత్రలో నటించిన వినోదిని వైద్యనాథన్‌ కలమ్మ పాత్రకు పర్ఫెక్ట్‌ గా సెట్ అయ్యారు. నేచురల్‌ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. హీరోయిన్ స్వప్న (తాప్సీ పన్ను) వీడియో గేమ్ డిజైనర్‌. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ సమస్య కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేసి గాయపడుతుంది. ఈ సంఘటన తరువాత పరిణామాలు స్వప్న జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? స్వప్న జీవితంతో అమృతకి సంబంధం ఏంటి? అన్నదే గేమో ఓవర్ సినిమా.   సినిమాకు ప్రధాన బలం సినిమాటోగ్రఫి, వినోద్‌ కెమెరా వర్క్‌, రాన్ ఏతాన్ యోహన్ మ్యూజిక్‌ ప్రతీ సీన్‌ను మరింత ఇంట్రస్టింగ్‌గా మార్చాయి. ఓవరాల్ గా చూస్తే గేమ్ ఓవర్ చూడదగ్గ సినిమా.

రేటింగ్. 3/5



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

‘గేమ్ ఓవర్ ’ మూవీ రివ్యూ

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×