Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

సుప్రీంకోర్టులో కలకలం. ఏకంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావటం దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతోంది. అయితే ఈ ఆరోపణలను రంజన్ గొగోయ్ తీవ్రంగా ఖండించారు. దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని..తనపై అవినీతి ఆరోపణలు చేయలేకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని గోగోయ్ ఆరోపించారు. జస్టిస్ ​ రంజన్‌ గోగొయ్‌ గతంలో తనను  లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ  35 ఏళ్ల మహిళ శుక్రవారం ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆమె 22మంది న్యాయమూర్తులకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ ఆరోపణలు చేశారు. 2018 అక్టోబర్‌ 10, 11 తేదీల్లో జస్టిస్‌ గొగోయ్‌ తన పట్ల అనుచితంగా ప్రవర్తించి,  వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. ఆయన వేధింపులకు తిరస్కరించినందుకు తనను, తన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేశారని, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె  ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం  చేయాలని కోరుతో సుప్రీం జడ్జిలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో శనివారం, ఏప్రిల్‌20న సిజేఐ జస్టిస్ రంజన్‌ గొగోయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆగస్టు  2018 లో ఆయన ఆఫీసులో నియామకం అనంతరం లైంగిక వేధింపులు చోటు చేసుకున్నాయి. ఈ వేధింపులను  ప్రతిఘటించిన నేపథ్యంలో  అనుమతి లేకుండా ఒక రోజు సాధారణ సెలవు తీసుకున్న కారణంగా డిసెంబర్ 21 న సర్వీసులనుంచి తొలగించారు.

జనవరి 11 న, ప్రధాన న్యాయమూర్తి, ఒక  మహిళా పోలీసు అధికారి  సమక్షంలో జస్టిస్ గొగోయ్ భార్యకు క్షమాపణలు చెప్పించారు.  అలా ఎందుకు చేశారో అర్థంకానప్పటికీ, పై అధికారి సూచలను  అనుసరించాను. ఆమె చెప్పినట్లే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాను. అయినా  వేధింపుల పర్వం ఆగలేదు. టెంపరరీ జూనియర్ కోర్టు అటెండెంట్‌గా ఉన్న దివ్యాంగుడైన నాబంధువును  సర్వీసు నుంచి తొలగిస్తూ జనవరి 14న ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఈ ఆరోపణలకు తోడు  వీటికి సంబంధించి కొంత వీడియో ఫుటేజ్‌ను, ఫోటోలను ఆమె అఫిడవిట్‌లో పొందుపర్చారు. అయితే ఆమె ఆరోపణలను  సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ కూడా ఈ ఆరోపణలను తిరస్కరించారు. ఇవి పూర్తిగా తప్పుడు, దురదృష్టకరమైన ఆరోపణలని పేర్కొన్నారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఆమెకు నేర చరిత ఉందని ఆమెపై ఇప్పటికే  రెండు ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్నారు.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×