Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

బాలకృష్ణ కమెడియన్ అట!

సినీ నటుడు నాగబాబు ఎందుకు ఇలా చేస్తున్నారు?. అసలు సినీ పరిశ్రమలో ఏమి జరిగింది. రాజకీయ పోరాటం కాస్తా..సినిమా పరిశ్రమలోకి పాకిందా?. ప్రస్తుతం పరిశ్రమలో ఇవే హాట్ టాపిక్ గా మారాయి. తనకు బాలకృష్ణ ఎవరో తెలియదు అంటూ నటుడు నాగబాబు ఇటీవలే వ్యాఖ్యానించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన బాలకృష్ణతో కలసి ఉన్న ఫోటోలను కూడా కొంత మంది సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఓ వైపు దీనిపై ఓ వివాదం సాగుతుండగానే..మరోసారి నాగబాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో నాగబాబు మరో అడుగు ముందుకేసి బాలకృష్ణను కమెడియన్ అని వ్యాఖ్యానించారు. తాను ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పాను. కానీ అది పొరపాటు. నా  ఫ్రెండ్స్ కొంత మంది ఫోన్లు చేసి చెప్పారు. అది సరికాదన్నారు. బాలకృష్ణ తెలియకుండా ఎవరుంటారు అండీ. బాలకృష్ణ అందరికీ తెలుసు అన్నారు. ఆయన మంచి నటుడు. కమెడియన్. ఎంతో బాగా చేస్తారు. ఆయన తన నటనతో కడుపుబ్బ నవ్విస్తారు.

అలాంటి హస్యనటుడు బాలకృష్ణని మర్చిపోయాననటం నా మిస్టేకే అంటూ సడన్ గా ఓ ఫోటో తీసి..ఇదుగోండి వల్లూరి బాలకృష్ణ అంటూ ఫోటో  చూపిస్తారు నాగబాబు. ఆయనకు చిన్న నిక్ నేమ్ కూడా ఉంది. అది అంజిగాడు. కృష్ణ అసాధ్యుడులో కూడా ఓ మంచి కామెడీ క్యారెక్టర్ చేశారు. వల్లూరి బాలకృష్ణ అని వికీపీడియాలో కొడితే ఆయన గురించి వస్తుంది. విషాదకరమైన వార్త ఏంటంటే ఆయన మన మధ్య లేరు. అయినా ఆయన సినిమాలు మనకు ఇప్పుడు నవ్విస్తాయి. అలాంటి హస్యనటుడిని మర్చిపోవటం నేను చేసిన మిస్టేక్. ఇప్పుడు సరిచేసుకున్నాను అంటూ నవ్వుతూ వీడియోను ముగించారు. తొలుత ఈ వీడియో చూసిన వారెవరైనా నిజంగానే నాగబాబు వివరణ ఇస్తున్నారు అనుకుంటారు. కానీ సడన్ గా బాలకృష్ణ పెద్ద కమెడియన్ అంటూ ఓ ఫోటో తీసి చూపించటం వివాదాన్ని పెద్దది చేయటమే అని విమర్శలు విన్పిస్తున్నాయి.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

బాలకృష్ణ కమెడియన్ అట!

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×