Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఎన్టీఆర్ కొత్త లుక్ పై క‌స‌ర‌త్తు ప్రారంభం

Tags: agravedeg

అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా కోసం కొత్త లుక్ లో క‌న్పించిన ఎన్టీఆర్ లుక్ మ‌ళ్లీ మార‌నుంది. ప్ర‌స్తుతం ఈ హీరో అర‌వింద స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌న కొత్త సినిమా కోసం ఎన్టీఆర్ న్యూ లుక్ పై ఫోక‌స్ పెట్టారు. ఈ అంశంపై ఆయ‌న‌ స్టీఫెన్ తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ స్టీఫెన్ ఓ ఫోటోను సోష‌ల్ మీడియాలెఓ షేర్ చేశారు. దీంతో రాజ‌మౌళి వ‌ర్కింగ్ టైటిల్  ఆర్ఆర్ఆర్ ప‌నులు ప్రారంభించిన‌ట్లు అయింది. కొత్త సినిమా షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి మొద‌ల‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం. తాజా ప్ర‌క‌ట‌న‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ కుషీలో ఉన్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఎన్టీఆర్ చేసిన సినిమాలు అన్నీ సూప‌ర్ హిట్ అయ్యాయి. అందులో ఇప్పుడు రాజ‌మౌళితో కొత్త సినిమా కావ‌టం, అందులో మ‌రో హీరో రామ్ చ‌ర‌ణ్ కూడా ఉండ‌టంతో ఈ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్ లో
ఉన్నాయి.
‘అరవింద సమేత’కు ఎన్టీఆర్‌ బాడీ లాంగ్వేజ్‌ను మార్చిన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్‌ మళ్లీ రంగంలోకి దిగేశాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కోసం ఎన్టీఆర్‌ ఫిట్‌నెస్‌ను మార్చేపనిలో ఉన్నాడు. ఈ విషయంపై జక్కన్నను కలిసి మాట్లాడిన విషయాన్ని, కలిసి దిగిన ఫోటోను స్టీవెన్‌ షేర్‌ చేస్తూ.. లెజెండరీ దర్శకుడిని కలిసినందుకు ఆనందంగా ఉందంటూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కోసం ఎన్టీఆర్‌ లుక్‌పై చర్చించేందుకు వచ్చానని.. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

ఎన్టీఆర్ కొత్త లుక్ పై క‌స‌ర‌త్తు ప్రారంభం

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×