జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ఓ వైపు ప్రత్యర్ధి పార్టీలపై రాజకీయ విమర్శల దాడి పెంచుతూ…మరో వైపు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ ను మంగళవారం నాడు విడుదల చేశారు. భీమవరం మావుళ్లమ్మ ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఈ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. ఈ తొలి ప్రతిని కార్యకర్తకు అందజేశారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికలకు ఇది పార్టీపరంగా దార్శనిక పత్రం అని పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు…
Related Articles
- మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
- గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు
- రేషన్ కు బదులు మహిళల ఖాతాల్లో నెలకు రూ. 2500 నుంచి 3500 వరకు జమ,
- బీసీలకు అవకాశాన్ని బట్టి ఐదు శాతం రిజర్వేషన్లు పెంపుదల
- బీసీలకు చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లు
- కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు
- ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం
8.ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్గాల విద్యార్ధులకు వసతి గృహాలు
- ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు
- ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ విధానం రద్దు
- వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు
- అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here