Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

తోట నర్సింహాంకు ఆ పదవి ఎందుకు?

Tags: agravedeg

లోక్ సభలో అవిశ్వాస తీర్మానం తెలుగుదేశంలో పార్టీలో ‘చిచ్చురేపుతోంది’. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరుపై ఎంపీలు భగ్గుమంటున్నారు. లోక్ సభలో టీడీపీపక్ష నేతగా ఉన్న తోట నర్సింహాంకు కనీసం అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఇవ్వకపోగా…చర్చలో ఆయనకు  ఒక్కసారి కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవటం పెద్ద దుమారమే రేపుతోంది. లోక్ సభలో పార్టీ నాయకుడిగా ఉన్న  తోట నర్సింహాంతో పోలిస్తే గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు తొలిసారి ఎంపీలే. తోట నర్సింహాం గతంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈ కొత్త ఎంపీలతో పోలిస్తే తోట నర్సింహాం ఎంతో సీనియర్. అలాంటిది ఆయనకు కనీసం నోటీసు ఇచ్చే ఛాన్స్ ఇవ్వకపోవటం ఒకెత్తు అయితే..పార్టీ తరపున మాట్లాడేవారి జాబితాలో ఆయన పేరు కూడా ఉండకపోవటం పెద్ద దుమారమే రేపుతోంది.

అంటే అసలు తోట నర్సింహాంకు ఏ కోణంలో ఈ పదవి ఇఛ్చారు. పదవి ఇఛ్చినప్పుడు గౌరవించాలి కదా?. మరి పదవి ఇచ్చి ఏపీకి సంబంధించిన అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా విషయంలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఏకంగా సభలో ఉన్న పార్టీ నాయకుడిని విస్మరించటం కంటే దారుణం ఏముంటుందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానాంచారు. అంతే కాదు ఏకంగా కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్ నేతతో కూడా సభలో మాట్లాడించకపోవటం సరికాదనే అభిప్రాయం విన్పిస్తోంది. వివాదస్పద వ్యాఖ్యలు..పరుషమైన పదజాలం వాడమంటే ఆయన ముందుకు రాకపోవచ్చు కానీ..గత ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రస్తుత ప్రధాని మోడీ ఎన్నికలకు ముందు ఇఛ్చిన హామీ వంటి అంశాలను ప్రస్తావించేందుకు అశోక్ గజపతిరాజు కూడా వెనక్కిపోయేవారు కాదని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు.

లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేశినేని నాని తొలి ఛాన్స్ తనకు ఇవ్వనందుకే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మూడవ వ్యక్తిగా మాట్లాడిన ఆయన స్పీచ్ చూసిన తర్వాత మాత్రం చంద్రబాబు నిర్ణయం సరైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు తీరుపై ఎంపీలు రాయపాటి సాంబశివరావు, నిమ్మల కిష్టప్ప వంటి వారు కూడా అంతర్గత సంభాషణల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జె సీ దివాకర్ రెడ్డి అయితే బహిరంగంగానే చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారు. అయితే చంద్రబాబు ఎమ్మెల్యేలకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంపీలకు ఇవ్వటం లేదని..చంద్రబాబు దగ్గర బెదిరిస్తే తప్ప..పని అయ్యేలా లేదని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు. మొత్తానికి అవిశ్వాసం తెలుగుదేశం పార్టీలో పెద్ద చిచ్చే రేపేలా ఉంది.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

తోట నర్సింహాంకు ఆ పదవి ఎందుకు?

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×