Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘తేజ్..ఐ లవ్ యూ’ షూటింగ్ పూర్తి

Tags: agravedeg

సాయిధరమ్ తేజ్. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న యువ హీరో. ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఏదీ కలసిరావటం లేదు. గత కొంత కాలంగా సాయిధరమ్ చేసిన సినిమాలు ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద ఫట్ మన్నాయి. ఈ తరుణంలో  ఈ కుర్రహీరో ఓ ప్రేమకథను నమ్ముకున్నాడు. అదే ‘తేజ్ ఐ లవ్ యూ’. ఇందులో సాయిధరమ్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈప్రేమ కథ అయినా సాయిధరమ్ ను గట్టెక్కిస్తుందా? లేదా అన్నది వేచిచూడాల్సిందే.

కరుణాకరన్  ఈ సినిమా దర్శకుడు కావటమే ఒకింత సానుకూల అంశంగా ఉంది. కరుణాకరన్ గతంలో దర్శకత్వం వహించిన సినిమాలైన డార్లింగ్, తొలి ప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి మంచి టాక్ సొంతం చేసుకున్నవే. యూత్ ను టార్గెట్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం నిర్మాణాంతనర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

‘తేజ్..ఐ లవ్ యూ’ షూటింగ్ పూర్తి

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×