Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కాపురాలు చేసే వారికి" తాళి "బరువు ! కంపెనీలు నడిపే వారికి "బట్టలు" బరువు !!




                                      కాదేది అనర్హం పబ్లిసిటి స్టంట్ కు !  కాపురం చేసుకుంటున్న  ఆలి ,ఆ ఆలి కున్న తాళి ఇవన్ని రాజకీయ పార్తీల  పబ్లిసిటి కోసం ఉపయోగపడుతుంటె , ఆఫీసులలో  పని చేసే స్తీలు , బట్టలు లేని వారి నగ్నత్వం  కంపెనీల పబ్లిసిటికి ఉపయోగ పడుతున్నాయి . ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటె  పార్టీలు, కంపెనీల ప్రచారం కోసం వెలగబెడుతున్న సదరు పబ్లిసిటి స్టంట్ లు "సోషల్ ఎక్స్పెరిమెంట్ " పేరుతో జరుగుతున్నవే . ఇందులో ప్రదానంగా పోకస్ కాబడుతుంది స్త్రీలే . బంగం కలుగుతుంది వారి ఆత్మాభిమానానికే . ఈ బుర్ర తక్కువ ప్రదర్శనలలో  పురుషులు ఉన్నట్లు అనిపించినా , చివరకు పోకస్ అయ్యేది  "తాళి లేని ఆలి , బట్టలు లేని  ఉద్యోగిని " మాత్రమే        . వీటి గురించి మరి కొంచం వివరంగా చెపితే కాని విషయం అర్దం కాదు.
                                                                             


                                              పై చిత్రంలో ఉన్న పేపర్ సారాంశం చుస్తే మీకు విషయం అర్దమై పోయి ఉంటుంది . వివాహం అయిన స్త్రీలు తాళి దరించడమన్నది పూర్తిగా హిందూ మత  పరమైన విషయం . దీనికి రాజకీయ పార్టీలతో కాని, ప్రభుత్వ పరమైన అంశాలతో కాని సంబందం లేదు . ప్రభుత్వాలు ఎక్కడా తాళి ని వివాహ గుర్తింపు కోసం ప్రమాణంగా అడగటం లేదు . వివాహ రిజిస్ట్రేషన్ లు కంపల్సరి చేసారు కాని ,స్త్రీలకు తాళి కంపల్సరి అని ఏ ప్రభుత్వాలు చెప్పడం లేదు .హిందూ సమాజంలో  నిజానికి తాళి ఒక సోషల్  సెక్యురిటి సింబల్ అయితే , సెక్యులర్ సమాజంలో అది ఒక ఎకనామిక్ స్టేటస్ సింబల్ . మెడలో నాలుగు తులాల బంగారం తాళి ఉన్న స్త్రీకి  ఉన్నఇన్ స్టెంట్  ఆర్దిక పరపతి , కేవలం పసుపు తాడు ఉన్న స్త్రీకి ఉండదు . భార్యాకు మెడలో బంగారం అబరణాలు చేయించడానికి బద్దకించే భర్తలు, కనీసం ఈ సాంప్రాదాయం వలన అయినా , కొంత బంగారం తాళి రూపం లో ఉంచాల్సి వస్తుంది. కాబట్టి సామాన్య స్త్రీలకు ఇది కచ్చితంగా ఆర్దిక పరమైన ఆలంబనే .

 మరి అటువంటి తాళిని , పెండ్లి అయి, భర్త పిల్లలతో హాయిగా కాపురాలు చేసుకుంటున్న స్త్రీలను , వారి కుటుంబాలను వేదికల మీదకు తీసుకు వచ్చి, వారి మెడలలో తాళి తీయంచడమ్ ఏమిటి? అసలు వారు హిందూ మతానికి వ్యతిరేకమైన "ద్రవిడ కలగం " పార్టి వారైతే , వివాహం లో తాళి ఎందుకు ధరించారు? ఇప్పుడు పబ్లిక్ గా తాళి తీసి వేయడమంటే , అది ఒక రకంగా మత మార్పిడి క్రిందకే రావడం కాక , హిందూ మతాన్ని తీవ్రంగా కించపరచడమే అవుతుంది . దీనికి సంబందితులును  క్రిమినల్ చట్టాలు క్రింద  ప్రాసిక్యుషన్ చేసి, శిక్షలు విదించాల్సిన అవసరం ఉంది . హీo దూయేతర్లను తాళి కట్టుకోమని  బలవంతం చేసే వారు భారత దేశం లో లేరు .తాళి తీసినంత  మాత్రానా , స్త్రీ పురుషుల మద్య సమానత్వం వస్తుందా ? అలా అయితే హిందూయేతర స్త్రీలు పురుషులతో సమాన హక్కులూ , అవకాశాలు కలిగి ఉన్నారా? నెవ్వర్!  కేవలం హిందూ మతాన్ని  కించపరచడానికి చెసే మతి మాలిన పనులు. దట్సాల్ . పై పెచ్చు దీనికి సామాజిక చైతన్యం  ప్రయోగం అంటు  వేదవ సమర్దనలు ఒకటి.స్త్రీలను కూడా దేవతలుగా బావించి పూజించే హిందూ జీవన విదానం గురించి ఎవరూ నీతులు చెప్పాల్సిన అవసరం లేదు .

                                                                       

                                                 
                                    పైన చెప్పిన  తాళి తీసే సామాజిక ప్రయోగం మన దేశంలోని తమిళ నాడులో జరిగితే , అమెరికాలోని కాలిపోర్నియాలొ మరొక రకం సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసారు , ఒక పబ్లిషింగ్ హౌస్ వారు . సదరు పబ్లిషింగ్ హౌస్ వారు తమ ఉద్యోగుల కోసం ,  డ్రెస్ కోడ్ పెడితే దానిని ఉద్యోగులు వ్యతిరేకించి , మా డ్రెస్ మా ఇష్టం అన్నారట . అనటమే కాదు అసలు బట్టలు లేకుండానే ఒక నెల మొత్తం ఉద్యోగం చేసి చూపిస్తాం అన్నారు అట. అన్నదే తడవుగా బట్టలు అన్ని విప్పేసుకుని , ఒకరిది ఒకళ్ళు చూసుకుంటూ నెల అంతా పన్ ఎంజాయి చేస్తున్నట్లు ఉంది . దీని శిర్షిక పతాకాలతో ప్రింట్ మీదియాలలో , ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిసిటి చేస్తూ , సదరు పబ్లిషింగ్ హౌస్ వారు  తాము కోరుకున్న పబ్లిసిటి సాదించారు . సిగ్గు లేకుండా ఉన్న  వారి నగ్న  ఉద్యోగుల  అభి ప్రాయాలను వెల్లడి చేసారు .
                                                వారికి మొదటి మూడు రోజులు ఎబ్బెట్టుగా అనిపించింది అట. తర్వాత మామూలే అయిందట. స్వచ్చమైన  పరిసరాలలో , మరింత నగ్నమైన తమ శరీరాలతో పని చెయడం వారికి ఎంతో ఆనందం ఇచ్చిందట. అలా అయితే నెల రోజులు మాత్రమే ఉగ్గ బట్టుకుని పని చేయడమెందుకు? జీవితాంతం చేయోచ్చు కదా ? దెబ్బకు జీవితం మీద విరక్తి పుట్టి , ఎంచక్కా అడవులలోకి వెళ్లి పోయి ఆకులూ అలములు తిను కుంటూ , ఒకరి ఒళ్ళు మరొకరు గోక్కుంటూ అడవి జంతువులు మాదిరి ఉండి పోవచ్చు కదా! ఏదైనా మూసుకోవాల్సిన వాటిని ముసుకుని, అవసరమైన వేలలో మాత్రమే తెరిస్తే నే అందం  ఆనందం. లేకుంటే  రోత పుట్టి, జీవన వైరాగ్యం కలుగుతుంది . జ్ఞాన మార్గాన కలుగవలసిన వైరాగ్యం , ఇలాంటి అజ్ఞానపు పనులతో కలగడం, ప్రస్తుత   మానవ జాతికి క్షేమ కరం కాదు.

   పై రెండింటిలో కామన్ విషయం ఒకటే. తమ ఉనికి కోసం, కొన్ని పనికిమాలిన సంస్తలు  చేస్తున్న పనులు ఇవి . అంతే!

  SOURCE :                http://www.deccanchronicle.com/150412/lifestyle-offbeat/article/office-employees-worked-naked-month-social-experiment
                                                     (16/4/2015 Post Republished)


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

కాపురాలు చేసే వారికి" తాళి "బరువు ! కంపెనీలు నడిపే వారికి "బట్టలు" బరువు !!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×