Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నిజమైన ఇండియన్ ముస్లిం లు ఇలా ఉంటారు ! అలా అనరు!



 
 

విబిన్న మతాలూ , సంస్కృతులు కు ఆలవాలమైన భారత దేశం లో ప్రజల మద్య శాంతి సామరస్యాలు తో కూడిన జీవన విదానం నిరంతరం కొనసాగాలంటే కేవలం ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటున్నామ్ అని పైకి చెప్పుకుంటూ , లోపల మాత్రం  మా దేవుడే గొప్ప అని గప్పాలు చెప్పుకుంటే కుదరదు. కనీసం సంవత్సరం కి ఒక సారైనా తమ తోటి సోదరుల ప్రార్ధనా మందిరాలకు వెళ్లి అక్కడా వారి విదానం లో ప్రార్దన చేసి , వివిధ మతాల ప్రజల చేత వివిధ పేర్లతో పిలువబడుతున్నా, భగవంతుడు ఒకడే అని ప్రాక్టికల్ గా  చాటి చెప్పాలి. ఇటువంటి విదానం హిందువులకు తెలిసినంతగా ప్రపంచం లో మరెవ్వరికి తెలియదు అనుకుంటా.

                                                                         



                      నాకు తెలిసి చాలా మంది హిందువులు ఇండియన్ ముస్లింల  ప్రార్ధనా మందిరాలు అయిన దర్గహ్ లకు వెళ్లి అచ్చం ముస్లిం లు ప్రార్దించే విదానం లోనే ప్రార్దించడమే కాక  తమకు కలిగే సంతానానికి ముస్లిం ల పేర్లే పెట్టిన వారు ఉన్నారు. అలాగే చర్చ్ లకు వెళ్ళె హిందువులూ ఉన్నారు. పల్లేటూళ్లల్లో ఉండే ముస్లిం స్త్రీ పురుషులు స్తానికంగా ఉండె దేవాలయాలకు వెళతారు . అలాగే ముస్లింలు జరిపే పీర్ల పండుగలో ఉళ్ళొని హిందువులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. కాని గ్రామాల్లోకి  కొత్త గా కొన్ని క్రిస్టియన్ మత  సంస్తలు ప్రవేసించి ,తమ మతం కాని వారిని ముక్యంగా హిందువులను అనేక ప్రలోబాలతో మత మార్పిడి చేయటం, వారిని తమ స్వంత మతం లోని ఏ పద్దతులను  పాటించకుండా చేయడం కోసం  హిందూ దేవాలయాలొకి వెళ్లొద్దు అని చెప్పడం, తమ బందువులు తీర్దప్రసాదాలు  ఇచ్చినా నిరాకరించమని చెప్పడం , చివరకు తల్లి తండ్రుల పోటొలకు మొక్కినా పాపమే అని బయపెట్టి  వారిని పక్కా హిందు వ్యతిరేకిగా మార్చారు. ఈ  దోరణితో గ్రామాలలో అప్పటి వరకు ఉన్న పరమత సహనం సన్నగిల్లి పోయి ఒకరి అరాదానా స్తలాలకు మరొకరు వెళ్ళడం మానివేసారు. మత మార్పిడి అనే వెదవ పనులు లేకుంటే మన దేశం లో అన్ని మతాల ప్రజలు ఎలా ఉండే వారంటే అచ్చంగా "కడప ముస్లిం లు " మాదిరి . నిజమైన ఇండియన్ ముస్లిం లకు ప్రతీక ఈ కడప ముస్లిం లు.

                                                                       

   
                           కడప లో  ముస్లిం లు హిందు దేవాలయాలకు వెళ్ళడం అనేది 11 శాతాబ్దం నుండి ఆచారంగా వస్తుంది. రాయల సీమ ప్రాంతానికే కాక యావత్ బారతావనిలో ఆరాద్య దైవం గా కొలిచే శ్రీ వేంకటేశ్వర స్వామిని  కడప ముస్లిం లు తమ ఇంటి అల్లునిగా , అయన దేవేరి అని చెప్పబడుతున్న " బీబీ నాంచారి " ని  తమ ఇంటి ఆడపడుచుగా బావిస్తారు. అందుకే సంవత్సరం లో తోలి రోజు అయిన ఉగాది నాడు కడపలో ఉన్న ఆ దేవదేవుని  గుడిని  సందర్శ్ంచి తమకు తోచినది సమర్పించి అయన కృపకు పాత్రులు అవుతున్నారు. అంతే  కాని తమ  మతగ్రందం లో అది లేదు , ఇది లేదు అని కుంటి సాకులు  చెపుతూ , తామే గొప్ప వారమని ఇతర మతస్తులు పనికి రాని  వారనే  బావం వారిలో ఏ కోశానా ఉండదు.
                                                                             


    ఇతర మత విదానాలతో పోల్చుకుంటే హిందూ జీవన విదానం ఎంతో పరమత సహనం కలిగి ఉంది అని చెప్పటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. హిందువులు తిరుపతిలో ఉన్న  దేవున్ని ఎలా కొలుస్తారో , కడపలో   ఉన్న దర్గా లోను అదేవిదంగా ప్రార్ధనలు చేస్తారు.  కాని ఇలా చెయ్యడానికి కొంతమందికి  వారి మత గ్రంధం లోని సూక్తులు అడ్డం వస్తాయట. మరి దర్గాలకు పోయి ప్రార్ధనలు చేయమని హిందూ మత గ్రందాల్లో ఉందా? హలాల్ చేసిన మాంసం తినమని ఏ హిందూ గ్రందం చెపితే చేస్తున్నారు?  ఏ మత విదానమైన ఆయా జీవన పరిస్తుతులకు అనుగుణంగా మారుతూ ఉండాలి తప్పా , "ఊరంతా ఒక దారైతే ఉలిపి కట్టే ది  ఒక దారి" అనే రీతిలో ఉండరాదు. భారత్ లాంటి దేశం లో ":భారత్ మాతాకి జై అని గొంతు మీద కత్తి పెట్టినా అనను" అనే పెడమాటలు మాట్లాడే వారు నిజమైన ఇండియన్  ముస్లిం లు కారు. అరబ్ దేశాలలోని ముస్లిం స్త్రీలు సైతం " భారత్ మాతా కి జై " అని ఈదేశం పట్ల తమకున్న స్నేహ సౌబ్రాతుత్వం చాటితే , ఈ  దేశం లో పుట్టి, ఎప్పుడో తమ తాతలు బలవంతంగా ముస్లిం లుగా మార్చబడిన నేరానికి , తామే గొప్ప మతారాధకులు అయినట్లు, "భారత్ మాతాకి జై " అంటె అదేదో పెద్ద పాపం అయినట్లు  డైలాగులు కొడితే ఎలా? నిజమైన ఇండియన్ ముస్లిం లు ఎప్పటికీ అలా అనరు. ఇష్టం లేకపోతే కనీసం మౌనంగా  అయిన ఉంటారు కాని , ఇలా రెచ్చగొట్టె మాటలు మాట్లాడరు .

                                                                             

 
                       దేశం లో నివసించే వారు ఎవరైనా సరే అన్ని మతాలను గౌరవిస్తాం అని నోటి తో చెప్పటం కాదు. ఆచరణలో కూదా చేసి చూపించాలి. అందుకు ఒకటే మార్గం. ప్రతి మతస్తుడు కనీసం సంవత్సరం కి ఒక సారైనా తోటీ సోదరుల ప్రార్ధనా స్తలాకు వెళ్లి ప్రార్ధనలు చేసి రావడం ఆనవాయితీ గా పెట్టుకోవాలి.  అప్పుడే అన్ని మతాల వారు బాయి బాయీ అనే మాటకు  ఒక అర్దం. పరమార్దం .విశ్వం అంతా "అల్లా " సృష్టియే అని నిజంగా నమ్ముతున్నవారైతే , ఆ విశ్వం లో బాగమైన హిందూ దేవాలయాలు అల్లా సృష్టి కాకుండా పోతుందా ? అందులో ఉన్న దేవుడిని పూజించటం అంటె "అల్లా ని ప్రార్దించడం " కాకుండా పోతుందా? అలా కాదు అనుకునే వారి   పిచ్చి కాకపోతే !
                                      (10/4/2016 Post Republished)


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

నిజమైన ఇండియన్ ముస్లిం లు ఇలా ఉంటారు ! అలా అనరు!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×