Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆఫీసుల లో "అతివ సేవ "ల కోసం ఆత్రపడి పోయే వారిని "వెధవ" లుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం !


                                                                               

                                కొంత మంది మగాళ్ళు ఉంటారు .వారు ఇంట్లో పూచిక పుల్లనైనా కదిలించడానికి ఇష్ట పడరు. వంటింట్లో ఇల్లాలికి సాయం చేయాలన్నా ,ఇంట్లో పిల్లలకు అవసరమైనవి చేసిపెట్టాలన్నా తెగ నామోషి ! కాని అదేమి విచిత్రమో కాని ,సదరు పురుష పుంగవులు ఆపీసు పనుల విషయం కి వచ్చే సరికి తోటి ఉద్యోగునుల పట్ల ప్రత్యేక శ్రద్ద ,అభిమానం కనపరుస్తూ ,వారి పని భారం అంతా తమదే అన్నట్లు తెగ పీలై పోతూ ,వారికి సకలోప చర్యలు చేయడానికి  తెగ ఆత్రపడి పోతుంటారు. నిజానికి ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లలకు ఈ తరహ మగవాళ్ళు తమ పట్ల చూపే ప్రత్యేక అభిమానానికి బాగా ఇబ్బంది పడిపోతుంటారు. వారు చూపే ప్రత్యేక అభిమానాన్ని ఎలా తిరస్కరించాలో తెలియక నానా అవస్థలు పడతారు. అలాంటి అతివలను రక్షించడానికి మన కేంద్ర ప్రబుత్వం వారు,ప్రబుత్వ ఉద్యోగుల  సేవా నిభందనలు  కు విస్త్రుత నిర్వచనాలు చెప్పారు  . అందులో మహిళా ఉద్యోగినుల పట్ల ప్రత్యేక అభిమానం చూపడం కూడా "వేదింపుల "లో బాగమే అని తేల్చి చెప్పారు.  
                                                                     
  కాబట్టి   ఆఫీసుల లో "అతివ సేవ "ల కోసం ఆత్రపడి పోయే మగ వారిని "వెదవ" లుగా  కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని చెప్పవచ్చు .ఎందుకంటె మహిళలను వేదింపులుకు గురి చేసే వారిని   మన సమాజం వెదవలు గానే గుర్తింస్తుంది కాబట్టి  !
                                      (26/3/2015 Post Republished)


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

ఆఫీసుల లో "అతివ సేవ "ల కోసం ఆత్రపడి పోయే వారిని "వెధవ" లుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం !

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×