Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

హత్యా యత్నం చేసింది అల్లుడే కదా అని 2 సార్లు క్షమిస్తే , ముచ్చటగా మూడోసారి సక్సెస్ అయ్యాక సరెండర్ అయ్యాడట!


       

                             ఆడపిల్లల్ని రాచి రంపాన పెట్టె అత్తింటి ఆరళ్ళు ఉన్నప్పుడు ఆమెను రక్షించు కోవలసిన బాద్యత తప్పకుండా పుట్టింటి వారిదె. సాoప్రాదాయ ప్రకారం అయినా కూతురి బాద్యత అల్లుడికి అప్పచేప్పడమంటే ఆమెకు పుట్టింట్లో  లేని లోటును తిర్చమనే తప్పా , ఆమెను శాశ్వతంగా పుట్టింటికి  దూరం చెయ్యమని కాదు. ఎ తల్లి తండ్రులు , అన్నదమ్ములు , ఆమె రక్షణ బాద్యత నుండి తప్పించుకొలెరు. చివరికి రాజ్యమైనా సరే పౌరులను  చట్టవ్యతిరేకంగా చంపే అధికారం కలిగి ఉoడదు .  మరి కేవలం తాళి కట్టాను కదా అనే మగ గర్వంతో ఆలి ని చంపే అధికారం ఎవరు ఇచ్చారు?
          ఆత్మహత్య చేసుకోవడానికే హక్కు నివ్వని బారత దేశం లో ఒక తల్లి కన్నబిడ్డను చంపే అధికారం లేని సమాజం లో, ఎట్టి కారణం చేతనైనా కానీ  భర్తకు భార్యను చంపే అధికారం లేదు  కాక లెదు. ఇష్టం లేకపోతె కారాణాలు చూపించి విడాకులు తీసుకుని వేరు అయి పోవడం తప్పా శిక్షించే హక్కు కూడా లేదు .  అసలు ఆలి ని కడ తెరుస్తాను అనే వాడిని శిక్షించే అధికారం, చంపినా వాడిని  ఉరి తీసే అధికారం రాజ్యానికి ఉంది . ఒక వేళ  రాజ్యం తన విది  నిర్వహణలో విపలమయితే దానిని ప్రశ్నించాల్సిన  గురుతర బాద్యత పుట్టింటి వారికి ఉంటుంది . అసలు ఆడపిల్ల  పుట్టింటి వారి నుండి భయం ఉన్న ఎ అల్లుడూ ఆడపిల్ల మిద చేయి వెయ్యడానికి అంతగా తొందర పడడు .ఆడపిల్లకు  రాజ్య రక్షణ కంటే బలమైనది పుట్టింటి రక్షణ . అది సహజ రక్షణ కూడా . మరి అటువంటి పుట్టింటి వారు అల్లుడు చేసిన నేర పూరితమైన  పనిని మొదట్లోనే సరి చెయ్యక పోవడం వలన చివరకు కన్నకూతురినే కోల్పోవలసి వచ్చింది . వివరాలు లోకి వెళితే

                 ఖమ్మం జిల్లా తిరుమాలాయ పాలెం మండలం , బీరోలు కు చెందిన హరీష్ కు నేలకొండపల్లి మండలం , నాచెపల్లి కి చెందిన అనూష తో 4 యేండ్ల క్రింద వివాహం అయింది . హరీష్ దంపతులు ఖమ్మం దగ్గర దంసలా పురంలో జీవిస్తున్నారు . వారికి 3 యేండ్ల అమ్మాయి ఉంది . అనూష 7 నెలల గర్భవతి . హరీష్ కి అనూష కి గత సంవత్సర కాలంగా గొడవలు అవుతున్నాయి . దానికి కారణం అదనపు కట్నం అని అనూష పుట్టింటి వారు అంటున్నారు . గత సంవత్సర కాలంలో రెండు సార్లు హరీష్ అనూషను హత్య చేయాలని ప్రయత్నించి విపలంయ్యాడట . ఒక సారి అడవి లోకి తీసుకు వెళ్లి, మరొక సారి గాస్ లిక్ చెయ్యడం ద్వారా హత్య చేయాలని ప్రయత్నిo చాడట . ఇది తెలిసి కూడా అనూష పుట్టింటి వారు అతని మిద చర్యలు తీసుకోకుండా కేవలం మందలించి వదలి పెట్టినట్లుంది . దానిని అలుసుగా తీసుకున్న హరీష్ అనూషను గతి లేని దానిగా బావించి , కొంత మంది రాజకీయ మిత్రుల సలహాతో కామోలు "కట్టెలు కొట్టుకోద్దాం రా " అని అనూషను ఏటి ఒడ్డుకు తీసుకు వెళ్లి , అక్కడ ఆమెను కర్కశంగా హత మార్చాడట .

  అ తర్వాత నింపాదిగా తన ఊరికి వెళ్లి అక్కడి రాజకీయ మిత్రుల ద్వారా పోలిస్ స్టేషన్లో లొంగి పోయాడు అంటే ఆ  హత్య వెనుకాల ఎంత ప్రి ప్లాన్ ఉందొ అర్ధమవుతుంది . ఆటను అంతలా తెగబడడానికి కేవలం అదనపు కట్నమేనా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది పోలిస్ విచారణలో తేలాల్సి ఉంది . అనూష తల్లి తండ్రుల పిర్యాదు మేరకు హరిశ్ కుటుంబం సబ్యులు అందరి పైనా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారట . ఏమి చేసినా పిల్ల బ్రతికి ఉండగా ఈ పని చేస్తే కనీసం ఆమె దక్కి ఉండేది కదా ! పుట్టింటి వారి సాచేత దోరణి  వలన అన్యాయంగా అడ పిల్ల బలి అయి పోయింది . ఇప్పటికైనా హరిశ్  ను ఉరి తీసే దాక విశ్రమించకుండా ఉండడమే అనూషకు పుట్టింటి వారు ఇచ్చె నిజమైన నివాళి . 

                                                (15/3/2014 Post Republished).


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

హత్యా యత్నం చేసింది అల్లుడే కదా అని 2 సార్లు క్షమిస్తే , ముచ్చటగా మూడోసారి సక్సెస్ అయ్యాక సరెండర్ అయ్యాడట!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×