Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మీ "రింగ్ లో ఫిoగర్ " చెపుతుంది అట ,మీరు 'తిరుగు బోతులా ' కాదా ? అన్న సంగతి !!!

                                                                   


ఇదేదో హస్త సాముద్రికం వాళ్లు చెప్పిన మాట కాదు . భగవద్గిత లో కృష్ణుడు చెప్పింది కాదు . మను స్మృతిలో మనువు చెప్పింది కాదు . సాంప్రదాయ జ్యోతిష్య శాస్త్రం చెప్పింది అసలే కాదు . అసలు సిసలైన ఆక్స్పర్డ్ యూనివర్సిటి శాస్త్రజ్ఞులు పరిశోదించి మరీ చెప్పింది కాబట్టి "విజ్ఞాన బాబులు " నమ్మక తప్పదు మరి .

  మనిషి యొక్క ప్రవర్తన ని నిర్ణయించడం లో అతడు లేక ఆమె పెరిగిన  పరిసరాల ప్రభావంతో పాటు అతని జన్యు వారసత్వం కూడా కారణమవుతుందని ఇదే బ్లాగులో ఒక టపా లో ప్రస్తావించినప్పుడు కొంత మంది శాస్త్రీయ వాదులు ఒప్పుకోలేదు . మనిషి వ్యక్తిత్వాన్ని  కేవలం అతని జీవన పరిస్తితులు  నిర్ణయిస్తాయి తప్పా ,జన్యు విదానం కాదని బుఖాయించారు .కాని ఈ నాడు నా వాదనకు బలం ఇచ్చే ప్రకటన ఒకటి  ఆక్స్పర్డ్ రిసెర్చర్ "రాఫెల్ లోడార్స్కి" గారు ఇవ్వడం నాకు సంతోషం కలిగించే విషయం .ఇంతకి అయన  గారు  తన పరిశోదన ల ద్వారా కనుగున్న విషయం ఏమిటంటె

  ఏ వ్యక్తికైతే తన కుడి చేతి ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే ఎక్కువ పొడవుగా ఉంటుందో వారు సెక్స్ విషయంలో చాలా చపలంగా ఉంటారు . అంటే తన జీవితO లో లైఫ్  పార్ట్నర్ ల తోనె  కాకుండా మరింత మందితో సెక్సువల్ రిలేషన్స్ కలిగి ఉండె అవకాశాలు ఎక్కువట . దానికి కారణం తల్లి గర్బం లో ఉన్నపుడు జరిగే ఉంగరం  వేలు  పొడుగు నిర్మాణం ని సంబందిత శిశువు లో సెక్స్ హార్మోన్ ల స్తాయి నిర్ణయిస్తుందట . అంటే  టెశ్టో స్టేరోన్ అనే హార్మోన్ స్తాయి అదికంగా ఉన్న వారికే ఉంగరం వేలు చూపుడు వేలు కంటె అదికంగా సాగుతుందట !
కాబట్టి పెరిగి పెద్దాయాకా కూడా వారిలో ఉన్న అధిక స్తాయి హార్మోన్ వారిని ఒకరితో సరిపుచ్చుకునే లా చేయదు కాబోలు ! మరింత మందితో సంబందాల  కోసం వేంపర్లాడెలా చేస్తుండబట్టె వారు ఎక్కువ  మందితో సెక్సువల్ సంబందాలు కలిగి ఉండటానికి ఆసక్తి చుపుతారట !. రింగ్ పింగర్  పొడవు,చూపుడు వేలు కంటే  ఎంత ఎక్కువుగా ఉంటె   అంత ఎక్కువ కాలం ఇతరులతో సంబందాలు కలిగి ఉండె చాన్స్ ఎక్కువుట ! అందుకె  రింగ్ లో పింగర్ మరీ ఎక్కువ ఉన్నవారికి "రింగ ,రింగా " ఎక్కువే కాబట్టి వారిని కొంచం అదుపులో పెట్టె విదానం ఉండాలి అన్న మాట .

  మరి ఉంగరం వేలు పొడవు ఎక్కువుగా ఉన్నవారు అందరూ తిరుగుబోతులే అని చెప్పటానికి వీలు లేదట .ఎందుకంటె మనిషిలోని గుణాన్ని అంచనా వేయడానికి రింగ్ లో పింగర్ శాస్త్రం ఒక్కటే సరి  పోదు కాబట్టి .ఇంకా అనేక విషయాలు మనిషిని ప్రభావితం చేస్తాయి కాబట్టి .ఉదాహరణకు ఒక వ్యక్తీ జన్మతః చపల మనస్తత్వం కలిగి ఉన్నా ,అతని    కుటుంభ నెపద్యం, పరిసరాల ప్రభావం , అతను  లేక అమెకు  జన్మతః సిద్దించిన  అవలక్షణ్ణాన్ని సరి చేసి క్రమశిక్షణ కలిగిన బాద్యతా యుతమైన వ్యక్తిగా  తీర్చి దిద్దవచ్చు .అందుకె మనిషి సంపూర్ణ వికాసానికి పటిష్టమైన,క్రమశిక్షణా యుతమైన కుటుంభ వ్యవస్త అవసరం. అలాగే  సమాజం ,రాజ్య వ్యవస్తలు ఉండాలి. అందుకె అన్నీ తెలిసిన వారు  అనేది "Everything we are is a combination of both our genetics and our environment."- దట్సాల్!

సోర్స్:-   http://timesofindia.indiatimes.com/home/science/Is-your-partner-faithful-Finger-length-can-tell/articleshow/46127621.cms?utm_source=facebook.com&utm_medium=referral&utm_campaign=TOI

                                                    (6/2/2015 Post Republished)


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

మీ "రింగ్ లో ఫిoగర్ " చెపుతుంది అట ,మీరు 'తిరుగు బోతులా ' కాదా ? అన్న సంగతి !!!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×