Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

వేదాంత🤚☝️ఆఫ్ దోస(ఆవ)కాయ😋

ఇవాళ, ఆదివారం చాలా లేటుగా మెలుకువొచ్చింది. ఎంత లేటంటే అది లంచ్ టైముకి తక్కువ, బ్రేక్ ఫాస్ట్ కి ఎక్కువా. అసలే చిరాగ్గా వుంది. టిఫిన్ ఏంటా అని చూస్తే అస్సలిష్టంలేని అటుకుల ఉప్మా !! తప్పక తిని, ఆ తిన్న పాపాన్ని నాలిక మీంచి కడిగేసుకుందామని మంచి కాఫీ ఒకటి కలుపుకుని దాన్ని పుచ్చుకుంటూ (పవిత్రమైన ద్రవాలని తాగకూడదు, పుచ్చుకోవాలని పెద్దలు చెప్పిన మాట!) వాట్సప్ ఓపెన్ చేశాను.

ముందు అన్నీ రొటీన్ ఫార్వార్డెడ్ మెసేజులు, పాటించలేక ఫార్వార్డ్ చేసేసిన అరిగిపోయిన సూక్తులు, దేవుళ్ళ బొమ్మలు వుండే గ్రూపులన్నీ దాటుకుని మా కాలేజీ గ్రూప్ కి చేరుకున్నాను. మా ఈ గ్రూపుకి క్రియేటివ్ అనే సఫిక్స్ ఒకటి పెట్టుకున్నాం. అంచేత ఇక్కడ సూక్తులు, ఫార్వార్డ్స్ బాగా తక్కువ.

మొట్టమొదట – యూ.ఎస్. నుంచి సేద్యం, సాహితీసేద్యం రెండిటి రుచీ తెలిసిన క్లాస్-మేట్ పెట్టిన పోస్ట్ పలకరించింది. ఆకుపచ్చటి తీగల నేపధ్యంలో గోల్డెన్-ఆరెంజ్ కలర్ లో మెరుస్తున్న దోసకాయలు, తన పెరటిలో పండినవి – ఆ ఫోటో పెట్టాడు.

చూస్తుంటే దోసకాయ ముక్కల పచ్చడితో మొదలుపెట్టి –

  1. దోసకాయ కాల్చిన పచ్చడి
  2. దోసకాయ పప్పు
  3. దోసకాయ కూర
  4. దోసకాయ ఆవ పెట్టిన కూర
  5. దోసకాయ సాంబారు
  6. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దోసావకాయ.

ఇలా దోస అవతారాలన్నీ గుర్తొచ్చి నోరూరించాయి. అటుకుల ఉప్మా తిన్న దోషం, దోసకాయ మహాత్మ్యం తలుచుకోవడంతో ఎగిరిపోయింది. కాఫీ మరీ రుచిగా అనిపించింది. ఇంక ఆనందం పట్టలేక నా స్పందనని ఇలా ఇచ్చాను.

దోసకాయ, a simple but great, spritually-loaded vegetable.
Its greatness spans from human taste buds to Vedas.
To understand that you will have to taste దోసావకాయ and explore the simple meaning of the vedic chant Maha Mrutyumjaya mantram.
It is easy to see that dosakaya is capable of subjecting man (& woman) to Attachment in the form of దోసావకాయ and also to liberate all in the form of Mrutyumjaya mantram by its own example. (Tells how easily a ripe dosa kaya detaches from its creeper)

ఇది నచ్చిన అమేరికా ఫ్రెండు అప్పుడే తరిగిన దోసముక్కల ఫొటో పెట్టాడు.

గ్రూపులో అందరికీ అమ్మమ్మలు దోసకాయ చేదుగా వుందో లేదో రుచి చూసి చెప్పమన్న చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.

ఇంతలో మరో ఫ్రెండు అన్నాడు –

“పండినవీ, ఎండినవీ ఏవైనా బంధాలు తెంచుకోక తప్పదుగా,” అని.

“అవును బ్రదరూ ! ఆ సంగతి దోసకాయకి తెలుసు కానీ, మనిషికి తెలీదు. తెలుసుకోడు.

మృత్యుంజయ మంత్రం అంటే మరణాన్ని ఆపేది అనుకుంటాడు కానీ దాన్ని తృణప్రాయంగా తీసుకుని దోసకాయ తన తీగ నుంచి విడిపోయినట్టు ప్రపంచం నుంచి విడిపోగలడా? ఇహలోకంలో ఇన్ష్యూరెన్సుల నుంచీ పరలోకంలో రంభ పక్కన బెర్తు వరకూ ఎన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి పాపం!!, ” అని రిప్లై ఇచ్చా.

ఇంతలో ఇంకో మెసేజ్ వచ్చింది. ‘ఠంగ్’మంటూ. ఏం లేదు, సింపుల్ గా “దోసావకాయ!! ఐ లవ్ ఇట్!!” అని వుంది.

అవును, ఎటాచ్-మెంటుకైనా, డిటాచ్-మెంటుకైనా దోసకాయ ఇచ్చినంత ఎఫెక్టివ్ మెసేజ్ ఏ గురువులూ, స్వాములూ ఇవ్వలేదే(రే)మో అనిపించింది.

దోసకాయాయ విద్మహే దోషరహితాయ ధీమహి

తన్నో దోసావకాయ ప్రచోదయాత్

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః

బై4నౌ



This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

వేదాంత🤚☝️ఆఫ్ దోస(ఆవ)కాయ😋

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×