Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఫిలాసఫీ! కాదు, 🐯పులాసఫీ😊

Tags: agravedeg

కొన్ని పనులు ఎందుకు చేస్తామో – ‘చేస్తామో’ అని అందర్నీ ఇన్‌వాల్వ్ చెయ్యడం ఎందుక్కానీ…… కొన్ని పనులు ఎందుకు చేస్తానో నాకే తెలీదు. అలాంటి పనుల్లో ఒకటే ఈ పోస్టు కూడా.

అసలాబొమ్మెందుకు గీశానో, అందులో ఆ ఫిలసాఫికల్ స్టేట్- మెంట్లు ఎందుకు ఇరికించానో నాకే తెలీదు.

Life is an Experience. Neither an Enjoyment nor a Suffering అంటోంది. ఏంటో దీని కాన్ఫిడెన్సు. ఎక్కడ, ఏ చెట్టు కిందయ్యిందో జ్ఞానోదయం. మనం ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా జీవితం చట్టంలా తన పని తను చేసుకుపోతుందని ఫిలాసపులికి ఎలా, ఎందుకు అనిపించిందో

అసలు పులికి ఫిలాసఫీకి ఆమడ దూరం. ఆమడ కాదు, ఆమడలే. మనకి, కాదు కాదు, నాకు తెలిసి పులి ఫిలాసఫీ మాట్లాడింది పంచతంత్రంలో పులి, బ్రాహ్మడు, బంగారు కడియం కధలోనే. అదీ దొంగ ఫిలాసఫీనే. మరి ఈ పులికెందుకింత హెవీ ఫిలాసఫీ పుట్టుకొచ్చిందో.

ఇదేమన్నా బోధిసత్వుడి అవతారమేమో. బోధిసత్వుడైనా కాకపోయినా కడియం పులి మాత్రం కాదు. డేంజరేం లేదు. ఏమైతేనేం డెైలాగులు బుద్ధుడి సూక్తుల్లాగే అనిపిస్తున్నాయి కదాని బ్లాగులో పెట్టేశా.

ఇంతే సంగతులు.

బై4నౌ



This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

ఫిలాసఫీ! కాదు, 🐯పులాసఫీ😊

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×