Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నోరూరించే చిక్కుడు ( Stuffed beans)

Telugu recipes (తెలుగు వంటకాలు)
స్టఫ్డ్ చిక్కుడు(Masala beans)

కావలసినవి
అర కిలో చిక్కుడు కాయలు 
నూనె: 4 టేబుల్ స్పూన్స్ 
ధనియాలు : అర కప్పు
పల్లిలు : 4 స్పూన్స్
శనగ పప్పు :4 టేబుల్ స్పూన్స్
మెంతులు : 1టేబుల్ స్పూన్
నువ్వులు : 1 టీ స్పూన్
ఎండు మిర్చి : 15
కరివేపాకు : 4 రెమ్మలు
కొత్తిమీర: కొద్దిగా
ఉప్పు : తగినంత
పసుపు : చిటికెడు

తయారు చేసే విధానం :
ముందుగా చిక్కుడు కాయల ఈనాలు తీసి వెయ్యాలి, మసాలా ని వేయటానికి మద్యలో విడా తీసి పెట్టుకోవాలి, తరువాత గిన్నెలో ఒక 2 టీ స్పూన్స్ నూనె వేసి కాగిన తరువాత పైన చెప్పిన దినుసులు అన్ని కొద్దిగా వేయించి పొడి కోట్టుకోవాలి అందులో సరిపోను ఉప్పు కలిపి ఆ పొడిని ఇంతకా ముందు విడాతేసిన కాయలో లో పెట్టాలి, గిన్నెలో మిగిలిన నూనె వేసి కాగిన తరువాత మసాలా నిoపినా చిక్కుడు కాయలను వేయించాలి, ఇప్పుడూ కొద్దిగా వాటర్ చల్లి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి, తరువాత మూత తీసి ముక్కలు విడి పోకుండా నెమ్మదిగా తిప్పుతూ వేయించి కొత్తిమీర చల్లాలి. తరువాత దించి రుచిని ఆస్వాదించండి.


This post first appeared on Food Recipies, please read the originial post: here

Share the post

నోరూరించే చిక్కుడు ( Stuffed beans)

×

Subscribe to Food Recipies

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×