Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నా అరుణ చంద్ర - ఎపిసోడ్ 8



ఇవి నావే, ఐనా చాలా వరకు ఆలోచన పరమైన మరియు ఆచరణ పరమైన సంగతులు...

ఈ-ధాన్యాలు ...



అండు కొర్రలు, ఆరికెలు, ఊదలు, కొర్రలు, సామలు, సజ్జలు ...

ఈ ధాన్యాలు చిరు ధాన్యాలు కిందకి వస్తాయి. పై పెచ్చు ...
ఇవి మన సంప్రదాయ పంటలు.
ఇవి నికారైన పోషకాల నిధులు.
ఇవి పుష్టికరమైన ఆహార నిల్వలు.
ఇవి మేలైన రుచికరమైన గింజలు.
ఇవి అనారోగ్య భక్షణలు.
ఇలా ... వీటి గురించి ఇలా ఎన్నన్ని ... ఎన్నెన్నో చెప్పుకోవచ్చు ...

కానీ, విచారకరమైన సంగతి ఏమిటంటే, ఆధునికం పేరిట జొప్పుకు వస్తూన్న ఆహారపు రీతుల్లో ఇవి వెనుకకు నెట్టేయబడుతున్నాయి ... అలా ఇవి మరగైపోతున్నాయి.

అంచేతనే, మరో మారు ఈ చిరు ధాన్యాలు గూర్చి చెప్పుకోతగ్గవి మరలా ముచ్చటించుకుందాం...
ఇవి ఎనలేనివి.
ఇవి అత్యంత విలువైనవి.
ఇవి అధిక పోషకాలు కలిగినవి.
ఇవి రమారమీ సర్వరోగ నివారిణిలు.
ఇవి దీర్ఘ కాలిక వ్యాధుల బాధల ఉపశమనానికి పక్కాగా ఉపయోగ పడేవి.
ఇవి శారీరక బరువుని తగ్గేంచేవి.
ఇవి మానసిక వికాసానికి తగ్గట్టువి.
ఇవి బలవర్ధకమైన ఆహారం గుణాలు కలవి.
ఇలా ... వీటి గురించి ఇలా ఎన్నని .. ఎన్నెన్నో చెప్పుకోవచ్చు ...

ఇక, ఇంకనూ మరింత వివరణగా తెలుసుకోతలిస్తే, వీటిలో ...
పీచు పదార్ధాలు
పిండి పదార్ధాలు
మాంసకృత్తులు
విటమినులు
ఖనిజాలు
సమస్త జీవన కారకాలు
సరితగ్గ పాళ్లల్లో సహజ సిద్ధమైనవిగా లభిస్తున్నాయి.

మరింత విపులంగా తెలుసుకోతలిస్తే, వీటి వినియోగం వలన ...
రక్త హీనత
బిపి
కొలెస్టరాల్
డయాబిటిస్
థైరాయిడ్
మూర్చ రోగం
కంటి సమస్యలు
గుండె సమస్యలు
ఊపిరితిత్తుల సమస్యలు
లివర్ సమస్యలు
కిడ్నీ సమస్యలు
జీర్ణాశయం సమస్యలు
అండాశయం సమస్యలు
ఊబకాయం
కీళ్ల సమస్యలు
కండరాల సమస్యలు
చర్మ సమస్యలు
వివిధ కేన్సరులు
వగైరా ... వగైరా వివిధ వ్యాధులు నయమవుతాయి. తద్వారా ...
రోగ నిరోధక శక్తి
నరాల శక్తి
రక్త శుద్ధి
మానసిక  దృఢత్వం
మంచి నిద్ర
వగైరా ... వగైరా వివిధ మేలులు అత్యంత శీఘ్రంగా లభిస్తాయి.


ఈ చిరు ధాన్యాలతో దోశలు చేసుకోవచ్చు, ఇడ్లీలు చేసుకోవచ్చు, చపాతీలుగా చేసుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, కిచిడీ చేసుకోవచ్చు, కేసరీ చేసుకోవచ్చు, లడ్లు చేసుకోవచ్చు ...
ఇలా వివిధ రూపాలతో బహు రుచులతో కూడిన వంటకాలు వీటితో భేషుగా చేసుకోవచ్చు ... కానీ పులుపు రుచికై నిమ్మకాయలను,
కారం రుచికై పచ్చి మిరపకాయలు/నల్ల మిరియాల పొడిని,
తీపి రుచికై తాటి బెల్లం/బెల్లంను,
ఉప్పురుచికై సముద్రం ఉప్పును,
మసాలా వాసనకై అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పొడి, దాల్చిన చెక్క పొడి, కొబ్బరి తురుము,
నూనెకై గానుగ పట్టిన నువ్వులు నూనె/ఆవు నెయ్యి ...
ఇవి మాత్రమే  వీటితో వాడడం చాలా మంచిది, శ్రేష్టం.

ఈ చిరు ధాన్యాలను ... ఒక్కొక్క రోజు  ఒక్కొక్క రకం చొప్పున ... లేదా రెండేసి రోజులకు ఒక్కొక్క రకం చొప్పున ... వీటన్నింటినీ మార్చి మార్చి నిత్య దినసరి వంటకాలకు బదులుగా మూడు పూటల (బ్రేక్ పాస్ట్, లంచ్, డిన్నర్)  వినియోగించుకుంటే చాలా మేలు.  అలాగే కూరలుగా ఆకు కూరలు,  కాయకూరలనే వినియోగించుకుంటే మరీ మంచిది. మాంసాహారం మానేస్తే ఫలితాలు మరింత శ్రేష్ఠంగా లభిస్తాయి.

కాఫీ, టీ, పాలు బదులు కరివేపాకు కలిపిన పల్చని మజ్జిగా, లేదా చెంచా తేనె కలిపిన ఈ చిరు ధాన్యాల జావలు/సూపులు తీసుకుంటే మరింత మేలు.

స్నేక్స్ గా  బెల్లంతో కూడిన చిన్నపాటి నువ్వుల ఉండ/లడ్డు ఒకటి, బెల్లంతో కూడిన చిన్నపాటి వేయించిన పల్లీల (వేరు శనగ పప్పు) ఉండ/లడ్డు ఒకటి తీసుకోవడం ఉత్తమం. కారం స్నేక్స్ కావాలనుకుంటే ఏ చిరు ధాన్యం తోనైనా చేసుకున్న రెండు వడల్ని కానీ లేదా కొబ్బరి నూనెలో వేయించిన అరటి చిప్సుని కానీ తీసుకొంటే మంచిది.

ఇట్టి ఈ ధాన్యాలుపై మక్కువ పడి ప్రయత్నిస్తే చాలా సులభంగా ఇవి ధాన్యాలుగా, పిండి రూపాలుగా లభిస్తున్నాయి. పైగా వీటి ధరలు చాలా అందుబాటులో ఉంటున్నాయి.

ఆరోగ్యమే మహా భాగ్యం అని నమ్మేవారు దయచేసి వీటి వినియోగం వైపు మొగ్గుతే బాగుంటుంది.

***
నా కబురులు అన్నింటికై ఇక్కడ క్లిక్/టచ్ చేయండి

***



నా రీతుల్లో, నా తీరుల్లో,  నా శైలిల్లో, మీ దరిన నేను పెడుతున్న నా వివిధ తెలుగు రాతలు ...


నా  వెబ్ సీరీస్ స్టోరీ అరుణ చంద్ర ఎపిసోడ్ 8 కై 
ఈ క్రింది చిత్రం పై క్లిక్/టచ్ చేయగలరు, ఓ మారు ...



***
నా రచనలు అన్నింటికై  ఇక్కడ క్లిక్/టచ్ చేయండి

***



నన్ను ఆకట్టుకున్న మరియు  ఆలోచింపజేసిన, చాలా వరకు ఉపయుక్తమైన విషయాలు ...


సూచిక
వెబ్ సెర్చ్ పాయింట్ (Google/Yahoo/Other) న 
బివిడి ప్రసాదరావు / BVD PRASADARAO అని టైపు చేసి 
ఎంటర్ బటన్/క్లిక్/టచ్ తో నా తెలుగు బ్లాగు నే కాదు నా మరిన్ని వివరములు 
ఎప్పుడైనా నేరుగా చూడవచ్చు
***

నా ముచ్చటలు అన్నింటికై ఇక్కడ క్లిక్/టచ్ చేయండి.


***



నా ధ్యాన సరళిలో మెదిలిన నాలోని సృజనలని  నా తలపులు గా మీరు ఇక్కడ చూడవచ్చు ... చదవవచ్చు ...


నా తలపు 20

ద్రోహం కారకం ద్రోహి కాదు, అతిగా నమ్మటమే.
***
 నా తలపులు అన్నింటికై ఇక్కడ క్లిక్/టచ్ చేయండి.

***
             
రేపటి టపా*
***
* ఆదివారం విరామం

Share the post

నా అరుణ చంద్ర - ఎపిసోడ్ 8

×

Subscribe to బివిడి ప్రసాదరావు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×