Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

టాబ్లెట్ or ఫ్యాబ్లెట్స్‌ ( Tablet or phablet)


టాబ్లెట్ పీసీ:ఇప్పుడు మొబైల్ అవసరం పెరిగిపోయింది. ఈ-మెయిల్, ఇంటర్‌నెట్ బ్రౌజింగ్, వీడియోలు, ఫోటోలు, డాక్యుమెంట్‌లు, ప్రజం ఫైళ్లు, సమాచార మార్పిడి ఇలా ఇప్పుడు ఎక్కడంటే అక్కడ అవసరం పడుతున్నాయి.ఆ అవసరాన్ని తీర్చడానికి రూపొందించిందే టాబ్లెట్ పీసీ.
                  టాబ్లెట్ పీసీలో ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయంటున్నారు సాంకేతిక నిపుణులు. ఇందులో జీఆర్‌పీఎస్(GPRS) సౌకర్యం ఉంది. ఇంటర్‌నెట్‌కు సులభంగా అనుసంధానం కావచ్చు. 3జీ ఫెసిలిటీ కూడా ఉంది. వీడియోలకు, ఈ-జర్నల్స్‌కు కొదవేలేదు. ఇలా లక్షన్నర అప్లికేషన్‌లు(APPs) ఈ టాబ్లెట్‌లో ఉంటాయి. వీడియోతో పాటు వెబ్‌కెమెరా, యూఎస్‌బీ(USB) కనెక్టివిటీతో సాధారణ కంప్యూటర్ నుంచి సమాచారాన్ని మార్పిడి చేసుకోవచ్చు.
                   ఏడు అంగుళాల టచ్ స్క్రీన్, 766 మెగా హెట్‌ల ప్రాసెజర్, 256 ఎంబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 2.2 ఓస్‌తో 180 నిమిషాల బ్యాటరీ బ్యాకప్

టాబ్లెట్ కొనే ముందు:

 నిన్నమొన్నటి వరకూ టాబ్లెట్ పీసీ అంటేనే గుర్తుకొచ్చేది ఆపిల్ ఐప్యాడ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పుణ్యమా అని పదుల సంఖ్యలో కంపెనీలు టాబ్లెట్ పీసీలను తయారుచేస్తున్నాయి. కొత్తకొత్త అప్లికేషన్లు, కాన్ఫిగరేషన్లను అందుబాటులోకి తెస్తున్నాయి. . మైక్రోసాఫ్ట్ కూడా తన విండోస్ 8 ఆర్‌టీతో టాబ్లెట్ పీసీల రంగంలోకి అడుగుపెడుతోంది. దీంతో నిన్నమొన్నటివరకూ టాబ్లెట్ పీసీనా... మనకెందుకునే అనుకునేవారు కూడా... కొంటే ఎలా ఉంటుందన్న ఆలోచనలో పడుతున్నారు. ఇంతకీ ఏ సైజు టాబ్లెట్ బాగుంటుంది? ప్రాసెసర్ స్పీడ్ ఎంత ఉండాలి? ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే మంచిది? మెమరీ, కనెక్టివిటీ సంగతులేమిటి? అన్నది చూస్తే...

1.అవసరాన్ని బట్టి సైజు...
                          మార్కెట్‌లో ఉన్న టాబ్లెట్లలో అత్యధికం పది అంగుళాల స్క్రీన్ సైజుతో వస్తున్నాయి. ఇంతకంటే తక్కువసైజు ఉన్నవి కూడా బోలెడు మార్కెట్‌లో ఉన్నాయి. అయితే మనం టాబ్లెట్ పీసీని ఎందుకు ఉపయోగించాలనుకుంటున్నామన్న అంశంపై ఆధారపడి సైజును ఎంచుకోవడం మంచిది. వెబ్ బ్రౌజింగ్, ఈ బుక్ రీడింగ్‌ల కోసమైతే ఏడు అంగుళాల సైజున్న గూగుల్ నెక్సస్, మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ లాంటివి సరిపోతాయి. పైగా తక్కువ సైజున్న టాబ్లెట్లు తేలికగా ఉంటాయి కాబట్టి సులువుగా తీసుకెళ్లవచ్చు. అయితే మీరు వీడియో ప్రియులైతే... లేదా గేమింగ్ ఇష్టమైతే మాత్రం పెద్ద స్క్రీన్‌సైజున్న టాబ్లెట్ పీసీని ఎంచుకోండి. వెబ్ బ్రౌజింగ్ చేయగలిగినా ఎక్కువ సమయం ఉపయోగించడం అంత సరికాదని నిపుణుల అంచనా. ఇంకో ముఖ్యమైన విషయం స్క్రీన్ సైజును బట్టి బ్యాటరీ లైప్ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా చిన్న స్క్రీన్‌సైజు ఉన్న టాబ్లెట్ల బ్యాటరీ లైఫ్ నాలుగు నుంచి ఆరుగంటలు ఉంటే... పెద్దవాటిల్లో ఇది తొమ్మిది గంటల వరకూ ఉంటుందన్నది తెలిసిందే.

మూడింటిలో ఆ ఒక్క ఓఎస్(OS) ఏది?
టాబ్లెట్ పీసీని నడిపించే ఆపరేటింగ్ సిస్టమ్ విషయంలో ప్రస్తుతానికి రెండే ఆప్షన్స్ ఉన్నాయి.
1. ఆపిల్ ఐఓఎస్... http://www.apple.com/osx/
2.ఆండ్రాయిడ్!  www.android.com
కాకపోతే త్వరలో
3. మైక్రోసాఫ్ట్ విండోస్ -8 ఆర్‌టీ
కూడా రంగప్రవేశం చేయనుంది. ప్రస్తుతమున్న ట్రెండ్‌ను పరిశీలిస్తే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్‌ను శాసిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. అనేక వెర్షన్లు అందుబాటులో ఉండటం, విడ్జెట్ సపోర్ట్(Widget support), మల్టీటాస్కింగ్‌లో కొంచెం మెరుగైన పనితీరు గూగుల్ సర్వీసులతో సులువుగా అనుసంధానమయ్యే అవకాశం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఉన్న అదనపు ప్రయోజనాలు. అయితే ఆండ్రాయిడ్ 2.3 నుంచి వచ్చిన అనేక వెర్షన్ల కంటే తాజా వెర్షన్ 4.1 జెల్లీబీన్ మెరుగైందని నిపుణుల అంచనా. కొంచెం డబ్బు ఎక్కువైనా పరవాలేదనుకునే వారికి ఆపిల్ ఐఓఎస్‌ను మించిన ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. గూగుల్ ప్లేతో పోలిస్తే... ఆప్‌స్టోర్ ఎంతో మెరుగైంది కావడం, వినియోగంలో ఉండే సులువు దీన్ని నెంబర్ వన్ OS ఓఎస్‌ను చేశాయనడంలో సందేహం లేదు.

హార్డ్‌వేర్ ఎలా ఉండాలి?
                                       నిజానికి ఈ అంశాన్ని నిర్ణయించడం కొంచెం కష్టమే. ఎందుకంటే దాదాపు అన్ని ప్రాసెసర్లూ ఏఆర్‌ఎం(ARM Processor) ఇన్‌స్ట్రక్షన్ సెట్‌నే ఉపయోగిస్తాయి. కాబట్టి వేగాన్ని ఇష్టపడేవారు. క్లాక్‌స్పీడ్ ఎక్కువ ఉన్న, లేదా మల్టీకోర్ ప్రాసెసర్లను ఎంచుకోవడం మేలు. అయితే ఇక్కడొక్క విషయం అర్థం చేసుకోవాలి. ప్రాసెసర్ స్పీడ్‌తో సంబంధం లేకుండా తాజా అప్లికేషన్లు కూడా పాత టాబ్లెట్లపై సులువుగా రన్ అవుతాయి కాబట్టి ప్రాసెసర్ స్పీడ్ అన్నది మన ఛాయిస్ అవుతుంది. ప్రాసెసర్ తరువాత టాబ్లెట్ పీసీ హార్డ్‌వేర్‌లో మనం జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అంశం స్క్రీన్ రెజల్యూషన్. ఇది ఎంత ఎక్కువ ఉంటే (ఒక అంగుళం సైజులో ఉండే పిక్సెల్స్) అంత స్పష్టత, చదవడంలో సౌలభ్యం ఉంటుందన్నమాట. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే... కనెక్టివిటీ! ఆండ్రాయిడ్ టాబ్లెట్‌తోపాటు అనేక కనెక్టివిటీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. యూఎస్‌బీ పోర్టు, హెచ్‌డీఎంఐ, అదనపు మెమరీ కోసం ఎస్‌డీ కార్డు స్లాట్‌లు ఉంటున్నాయి. మరోవైపు ఆపిల్ ఐప్యాడ్‌లో తమదైన పోర్టు ద్వారా మాత్రమే కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఇందుకోసం కొత్తగా అడాప్టర్లు, పోర్టులు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నమాట.

ట్యాబ్లెట్ పీసీ పేపర్ టాబ్లెట్ పరిమాణంలో ఉంటుందీ పిసి. చూడ్డానికి చిన్నగా ఉన్నా పర్సనల్ కంప్యూటర్‌లో ఉన్న ఫీచర్లన్నీ ఇందులో ఉంటాయి.పిసి స్క్రీన్‌పై నేరుగా డిజిటల్ పెన్ సహాయంతో పేపర్‌పై ఎలా రాస్తామో అదే విధంగా రాయవచ్చు స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే స్క్రీన్ పెద్దగా ఉండడం, స్పష్టత వీటికి కలిసి వచ్చే అంశం..ట్యాబ్లెట్‌ పీసీల్లో 3G మొబైల్ సర్వీసు కలిసి ఉండడంతో వినియోగదారులు వీటి పట్ల విపరీతంగా ఆకర్షితమవుతున్నారు. ఒక చోటి నుండి మరో చోటికి తీసుకు వెళ్ళగలిగేలా ఈ Tablet PC ల ను తాయారు చేసినారు

 ట్యాబ్లెట్ విశిష్టతలు.: పోర్టబులిటీ, 7 అంగుళాల స్క్రీన్‌సైజు నుంచి లభించే ట్యాబ్లెట్ పీసీల్లో చాలామటుకు (Android) ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తాయి,Microsoft సంస్థ ప్రత్యేకంగా XP ఆపరేటింగ్ సిస్టమ్‌ని తయారు చేసింది. Windows XP Pro Tablet PC Edition,. ఇందులో మన రాసే రాతల్ని అక్షరాలుగా మార్చే Hand Recognition  టెక్నాలజీ లభిస్తోంది. బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. ప్రొసెసర్ తక్కువ వేడికి గురవుతుంది. Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు అనేక థర్డ్‌పార్టీ అప్లికేషన్లు లభిస్తున్నాయి.టాబ్లెట్ పిసితో పాటు అందించబడే పెన్‌ని ఉపయోగించి ఆపరేటింగ్ సిస్టమ్‌లోని, అప్లికేషన్లలోని మెనూలను యాక్సెస్ చేయవచ్చు. ఒకసారి చార్జ్ చేసిన తర్వాత 4 నుండి 12 గంటల వరకు బ్యాటరీ నిలిచి ఉంటుంది. Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‌ పై మనం రెగ్యులర్‌గా ఉపయోగించుకునే MS-Office, Page maker,Photo shop వంటి అన్ని అప్లికేషన్లూ టాబ్లెట్ పిసిపై  రన్ అవుతాయి.

దీని నుంచి ఈ-మెయిల్స్‌ను పంపుకోవచ్చు. సోషల్ అప్లికేషన్లను వినియోగించవచ్చు. బ్లూటూత్, వైఫై, వీడియో రికార్డింగ్, వీడియో, వాయిస్ కాల్స్ దీని సొంతం. మోడల్‌ నుబట్టి ఇంటర్నల్ మెమరీ 16 జీబీ నుంచి 64 జీబీ వరకు ఉంది. కొన్ని ట్యాబ్లెట్లయితే హై డెఫినిషన్ వీడియోను ఆఫర్ చేస్తున్నాయి. గీతలు పడకుండా స్క్రీన్‌పై గొరిల్లా గ్లాస్ ఉంటుంది. తాజాగా హనీకాం 3.0 వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి బోర్డు రూం మీటింగుల్లో ఇవి తప్పకుండా ఉంటున్నాయి
Tablet PC Processor : Intel  Centrino, Dothan

Tablet PC Harddisk : 60 GB - 120 GB

టీవీ చూడాలా?
మన దేశానికి చెందిన 50 టీవీ ఛానళ్లను ఉచితంగా ట్యాబ్‌లో చూడాలంటే NexGTv ఇన్‌స్టాల్ చేసుకుంటే సాధ్యమే.
* ఇదే మాదిరిగా YuppTV ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మీరు వాడుతున్న త్రీజీ సర్వీసుతో ఉచితంగా అందిస్తున్న ఛానళ్లను చూడొచ్చు. http://goo.gl/nHoMT
ఈ-పుస్తక స్థావరం!
ట్యాబ్లెట్‌లో ఈ-బుక్స్‌ని చదవాలంటే Kindle స్టోర్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి. వేలాది పుస్తకాలను వెదికి ఉచితంగా అందుబాటులో ఉన్న వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కమర్షియల్‌గా అందుబాటులో ఉన్న పుస్తకాల్ని కూడా కొనుగోలు చేసి చదువుకోవచ్చు. వార్తా పత్రికల్ని చదవడానికి కూడా ఇదో అనువైన వారధి. పుస్తకాల ఫాంట్ సైజు, Brightness & Orientation ని కూడా మార్చుకోవచ్చు. http://goo.gl/qdAfV
* ఇలాంటిదే మరోటి Kobo. నచ్చిన పుస్తకాలను సోషల్‌నెట్‌వర్క్‌ల్లోని స్నేహితులతో పంచుకోవచ్చు. http://goo.gl/a7MRV
ఇవి తెలుసా?
* వేగంగా వెబ్ బ్రౌజింగ్ చేయడానికి ప్లగ్గిన్ సెట్టింగ్స్‌ని 'on-demand' గా మార్చేయండి. ఇది బ్రౌజర్ సెట్టింగ్స్‌లోని Advanced menu లో ఉంటుంది.
* డీఫాల్ట్‌గా ట్యాబ్‌లో వచ్చే కీబోర్డ్ నచ్చకపోతే థర్డ్‌పార్టీ కీబోర్డ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కావాలంటే SwiftKey 3 ట్యాబ్‌ని ప్రయత్నించండి. గూగుల్ ప్లే నుంచి ఉచితంగా పొందొచ్చు. http://goo.gl/A6vrC
* మరోటి TouchPal. http://goo.gl/xljCa
* జీపీఎస్, వై-ఫై, బ్లూటూత్ సదుపాయాల్ని వాడని సమయంలో స్విచ్ఆఫ్ చేసి బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచొచ్చు.
* ఇన్‌స్టాల్ చేసే అదనపు అప్లికేషన్లను ఇంటర్నల్ మెమొరీ కాకుండా ఎస్‌డీకార్డ్‌తో సేవ్ చేయండి. అందుకు సెటింగ్స్‌లోని Apps లోకి వెళ్లి Move to SD Card ని సెలెక్ట్ చేయండి.
* సెలెక్ట్ చేసిన ఆప్షన్లను చదివి వినిపించాలంటే TalkBack ని సెట్ చేయండి. అందుకు సెట్టింగ్స్‌లోని Accessibility లోకి వెళ్లాలి.
* ఎక్కువ టైపింగ్ వర్క్‌తో డాక్యుమెంట్స్ తయారు చేయాలంటే లాగీటెక్ తయారు చేసిన ట్లూటూత్ కీబోర్డ్‌తో చాలా సులభం. తక్కువ బరువుతో ట్యాబ్‌పై టైపింగ్‌కి అనువుగా రూపొందించారు. ధర సుమారు రూ.3,995. ఇతర వివరాలకు http://goo.gl/bSxgZ

మరో తెరలా!
పీసీ, ల్యాప్‌టాప్‌ని కనెక్ట్ చేసి ట్యాబ్లెట్‌ని అదనపు డెస్క్‌టాప్ తెరగా వాడుకోవాలనుకుంటే ScreenSlider టూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ధర సుమారు రూ.52. గూగుల్ మార్కెట్ నుంచి టూల్‌ని నిక్షిప్తం చేసి వై-ఫై నెట్‌వర్క్ ద్వారా ట్యాబ్‌ని సిస్టంకి కనెక్ట్ చేయవచ్చు. దీంతో ఇక మీ ట్యాబ్ వైర్‌లెస్ మానిటర్‌గా మారిపోతుంది. ఇక టచ్‌స్క్రీన్‌పై పీసీ అప్లికేషన్స్‌ని మునివేళ్లపైనే ఆడించొచ్చు. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/HGTwN
మలుపు మలుపుకీ!
మీ ట్యాబ్‌లో 3జీ సదుపాయం ఉంటే ప్రీలోడెడ్‌గా ఇన్‌స్టాల్ చేసిన గూగుల్ నేవిగేషన్, గూగుల్ మ్యాప్స్‌తో వెళ్లాల్సిన మార్గాన్ని లైవ్‌లో చూస్తూ గమ్యాన్ని చేరవచ్చు. ఒకవేళ ట్యాబ్‌లో నెట్ సదుపాయం అందుబాటులో లేనప్పటికీ స్టోర్ నుంచి MymapIndia Sygic ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ధర సుమారు రూ.1348. ఆఫ్‌లైన్‌లో ఇది పని చేస్తుంది. లైవ్ డైరెక్షన్స్ మాత్రమే కాకుండా వాయిస్ కమాండ్స్‌తో దారి చూపుతుంది. త్రీడీ బిల్డింగ్ వ్యూలో మ్యాపింగ్ చూడొచ్చు. వాహనం వెళుతున్న వేగాన్ని కూడా దీంట్లో చూడొచ్చు. http://goo.gl/wLMRz

ట్యాబ్లెట్ వాడితే ఇవి తప్పనిసరి!!
మార్కెట్ అంతా ట్యాబ్లెట్‌ల మయం. చౌక ధరల్లోనే చేతుల్లోకి చేరిపోతున్నాయి.ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్నమైన ట్యాబ్లెట్ అప్లికేషన్ లనుచూద్దాం!!
'షేక్' చేయండి!:వాడేది ఏ కంపెనీ ట్యాబ్లెట్ అయినా ఓఎస్ ఆండ్రాయిడ్ అయితే 'ఫొటోషేక్' అప్లికేషన్‌ను 
స్టోర్ నుంచి ఉచితంగా పొందొచ్చు. ఫొటోలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దొచ్చు. వివిధ డిజైన్లలో  అమర్చుకునే వీలుంది. కావాల్సిన ఫొటోలను ఎంపిక చేసుకుని ట్యాబ్‌ని ఒక్కసారి షేక్ చేస్తే చాలు, అవి Collage Images గా మారిపోతాయి. ఎడిట్ చేసిన వాటిని సోషల్ నెట్‌వర్క్ ద్వారా పంచుకోవచ్చు http://goo.gl/76qZY

* మీరున్న ప్రాంతంలో నెట్‌వర్క్ కనెక్షన్‌తో ఇబ్బందులు ఎదురవుతుంటే, సులువైన పద్ధతిలో  వై-ఫై, జీఎస్ఎం,
 సీడీఎంఏ, 4జీ, 3జీ, 2జీ... నెట్‌వర్క్ సిగ్నల్స్‌ని వెతికి పట్టుకోవాలంటే OpenSignalMaps టూల్  ఇన్‌స్టాల్
చేసుకోండి. Signal Direction, Signal graph, Signal Strength... సౌకర్యాలు ఉన్నాయి. http://goo.gl/VlPPQ

* ట్యాబ్‌లోని సమాచారాన్ని సురక్షితంగా బ్యాక్అప్ చేసుకోవాలంటే Titanium Backup Root టూల్‌ని పొందండి.
ఎస్ఎంఎస్‌లు, ఎంఎంఎస్‌లు, కాల్స్, బుక్‌మార్క్‌లను కూడా బ్యాక్అప్ చేయవచ్చు. http://goo.gl/Z3g7u
* వాల్‌పేపర్లు నిర్ణీత సమయంలో వాటంతట అవే మారేలా చేయాలంటే Wallpaper Changer ఉంటే సరి.
 http://goo.gl/1JQ4z

* మొబైల్ యూజర్లు 'ఫొటోబక్కెట్' ఫొటో షేరింగ్ సైట్‌ని అప్లికేషన్ మాదిరిగా ఇన్‌స్టాల్ చేసుకోడానికి
http://goo.gl/1CNQE

ఇలా బ్రౌజింగ్!
కంప్యూటర్‌లో మాదిరిగానే ట్యాబ్లెట్‌లో ఫైల్స్‌ని బ్రౌజ్ చేయాలంటే File Manager HD అప్లికేషన్ ఉండాలి.
లిస్ట్, గ్రిడ్ వ్యూల్లో ఫైల్స్‌ని బ్రౌజ్ చేసుకోవచ్చు. ఫొటోలను థంబ్‌నెయిల్ వ్యూలో చూడొచ్చు.
 ఒక్కమాటలో చెప్పాలంటే పీసీలో విండోస్ ఎక్స్‌ప్లోరర్‌ని వాడినట్టుగా ఉంటుంది. http://goo.gl/ttBfA
అన్నీ అక్కడే...
ఆండ్రాయిడ్ ఓఎస్‌తో ట్యాబ్లెట్ వాడుతున్నట్లయితే www.androidzoom.com లోకి వెళ్లండి.విభాగాల వారీగా
అప్లికేషన్లు ఉంటాయి. ఉచిత అప్లికేషన్లకు ప్రత్యేక మెనూ ఉంది. Browse Categories లోకి వెళ్లి మరిన్ని రంగాలకు
సంబంధించిన అప్లికేషన్లు బ్రౌజ్ చేసుకోవచ్చు.
* ఇదే మాదిరిగా www.soft32.com/mobile/tablet-pc నుంచి కూడా అప్లికేషన్లను పొందే వీలుంది.
రేటింగ్ ద్వారా ఆయా అప్లికేషన్ల ప్రాధాన్యత తెలుస్తుంది.
* ఆండ్రాయిడ్ యూజర్లకు మరో స్థావరం http://getandroidstuff.com ఓఎస్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌ని
ఎప్పకప్పుడు తెలుసుకోవచ్చు. గేమ్స్, చిట్కాల్ని కూడా పొందొచ్చు.
అప్‌డేట్ ఏదైనా!
ఆండ్రాయిడ్‌కి సంబంధించిన సరికొత్త అప్‌డేట్స్‌ని నిత్యం తెలుసుకోవాలంటే www.androidpolice.com
వెబ్ సర్వీసులోకి వెళ్లాల్సిందే. మార్కెట్‌లోకి విడుదలైన ట్యాబ్‌ల రివ్యూలు చూడొచ్చు. ట్యాబ్ వాడకంలో
 చిట్కాల గురించిన వివరాల్ని Tips and Tutorials లో పొందొచ్చు.
* ఇలాంటిదే మరోటి www.bestandroidapps.in ఎక్కువ ఆదరణ పొందిన వాటిని 'బెస్ట్ ఆండ్రాయిడ్ అప్స్'లో
పొందొచ&


This post first appeared on MAKE MONEY ONLINE -- SYED RAFIQ, please read the originial post: here

Share the post

టాబ్లెట్ or ఫ్యాబ్లెట్స్‌ ( Tablet or phablet)

×

Subscribe to Make Money Online -- Syed Rafiq

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×