Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రకుల్ ప్రీత్ సింగ్ రూట్ మారుస్తుందా?

రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు ఈ భామ టాలీవుడ్ లో ‘గోల్డెన్ లెగ్’ అని పేరు తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో మాత్రం హవా తగ్గింది. కొత్త కొత్త హీరోయిన్లు వస్తుండటంతో..పాత వాళ్లు అలా క్రమక్రమంగా తెరమరుగైపోవటం ఖాయమే. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు ఏమీ లేవు. ఈ తరుణంలో ఒకప్పటి గోల్డెన్ లెగ్ ఐటెం సాంగ్ చేయటానికి కూడా రెడీ అయిపోయిందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. బోయపాటి శ్రీను సినిమాలు అంటే అందులో ఐటెం సాంగ్ లు అదరగొట్టడం ఖాయం. గత బోయపాటి  సినిమాలు చూసిన వారెవరికైనా ఈ సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్. తన సహజశైలిలోనే ఇందులోనూ  ఓ ఐటెం సాంగ్ కు బోయపాటి ప్లాన్ చేశారని సమాచారం. అందుకు రకుల్ ఫ్రీత్ సింగ్ ను ఒఫ్పించే ప్రయత్నాల్లో ఉన్నారని..ఇది ఓకే అయితే రామ్ చరణ్, రకుల్ ఆడిపాడటం ఖాయంగా కన్పిస్తోంది. కానీ ఇప్పటివరకూ రకుల్‌ ప్రత్యేక గీతాల్లో చేయలేదు. ఒకవేళ ఈ పాటకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. ఇదే ఆమె  ఫస్ట్‌ ప్రత్యేక గీతం అవుతుంది. మరి అందుకు రకుల్ ఒఫ్పుకుంటుందా?.లేదా వేచిచూడాల్సిందే.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

రకుల్ ప్రీత్ సింగ్ రూట్ మారుస్తుందా?

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×