తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటం దాదాపు ఖాయం అయింది. ఓటుకు నోటు కేసు మచ్చ ఉన్నా కూడా తెలంగాణలో మంచి ఫాలోయింగ్ నేతల్లో రేవంత్ రెడ్డి ముందు వరసలో ఉంటారనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి నేత కేవలం తన ఒక్క సీటు కోసం..తన గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరతారా? అంటే ఖచ్చితంగా కాదనే చెప్పొచ్చు. మరి ఏమి జరుగుతోంది. తెలంగాణ తెలుగుదేశంలో తన వర్గంగా ఉన్న వారితోపాటు మరికొంత మందికి కలిపి రేవంత్ రెడ్డి తన కోటా కింద ‘25 సీట్లు’ కావాలని కాంగ్రెస్ అధిష్టానం ముందు డిమాండ్ పెట్టారు. అయితే కాంగ్రెస్ మాత్రం 15 సీట్లకు మాత్రమే ఓకే అన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం పట్టువిడవకుండా తాను కోరిన సీట్లు తన వర్గం వారికి ఇవ్వాల్సిందే అని పట్టుబడినట్లు సమాచారం. అయితే అంతిమంగా ఎన్ని సీట్లకు ‘లెక్క’ కుదిరింది అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. ఈ విషయం తేలాలంటే కొంత కాలం ఆగాల్సిందే. మొత్తానికి తాజా పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త జోష్ తేనుండగా..తెలంగాణ టీడీపీకి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అత్యంత గడ్డుకాలమే.
Related Articles
అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం రేవంత్ రాక మంచి జోష్ ను ఇవ్వటం ఖాయంగా కన్పిస్తోంది. తెలంగాణ సర్కారును ఎదుర్కొనే విషయంలో బిజెపి కేవలం మాటలతో సరిపుచ్చుతుంది కానీ…ఎలాంటి యాక్షన్స్ లేవు ఆ పార్టీలో. కాస్తో కూస్తో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ఢీ కొడుతున్నది అంటే కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ ఇచ్చిన పార్టీ అనే ఓ సానుకూల అంశం కూడా కాంగ్రెస్ కు ఉంది. అయితే పార్టీలోని నాయకుల మధ్య అనైక్యత ఓ సమస్య అయినా..కొంత మంది నేతలు ముందు గెలుపుపై దృష్టి పెడదాం..మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం అంటూ ‘సర్దుబాటు’ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయం కూడా మరింత వేడెక్కడం ఖాయంగా కన్పిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి ‘ఎసరు’ పెట్టిన సీట్లు ఎవరివి అన్నది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకంగా మారనుంది. ఏమైనా రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం ‘హాట్ హాట్’ గా మారనుంది.
The post రేవంత్ రెడ్డి డిమాండ్..25 అసెంబ్లీ సీట్లు! appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here