Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రాజమౌళే కాదు..వాస్తు సిద్ధాంతి కూడా లండన్ వెళ్లొచ్చారు!

Tags: agravedeg

రాజమౌళి. రాజధాని. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రస్తుతం ఇవే హాట్ టాపిక్. జాతీయ మీడియా కూడా ఈ ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ప్రపంచంలోనే పేరుగాంచిన నార్మన్ ఫోస్టర్ డిజైన్లే ముఖ్యమంత్రి చంద్రబాబును సంతృప్తిపర్చలేకపోతే ఇక ఎవరు సంతృప్తిపర్చగలరని వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఎలాగైనా రాజమౌళిని ఈ సారి లండన్ తీసుకెళ్ళి రాజధాని అమరావతి డిజైన్లు ఖరారు చేయించుకోవాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబుతో భేటీ కోసం రాజమౌళి బుధవారం నాడు అమరావతి వెళ్లారు. వచ్చే నెలలో చంద్రబాబు తలపెట్టనున్న లండన్ పర్యటన సమయంలో ఆయన్ను కూడా లండన్ ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి అయితే దీనికి రాజమౌళి అంగీకరిస్తారా? లేదా అన్నది వేచిచూడాల్సిందే. రాజధానికి సంబంధించి ఇంకో విశేషం ఏమిటంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యామిలీ వాస్తు సిద్ధాంతి రాఘవయ్య చౌదరి ఓ సారి లండన్ వెళ్ళొచ్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డిజైన్ల ఖరారు సమయంలోనే వాస్తు విషయంలో జాగ్రత్తలు తీసుకునేందుకు వెళ్ళగా ఈ రాఘవయ్య చౌదరిని కూడా లండన్ పంపినట్లు తెలిపారు.

                                  ఆయన తన సూచనలు..సలహాలు ఇఛ్చేసి వచ్చారని చెబుతున్నారు. రాఘవయ్య చౌదరి ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన వాస్తు సలహాలతో పాటు…హెరిటేజ్ వ్యవహారాలు కూడా ఆయనే చూసుకుంటారని ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం చంద్రబాబు వాస్తు పండితుడుగా ఉన్న రాఘవయ్య ఏది చెపితే దానికే ఓకే చేస్తున్నారని..ఈ మధ్య వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక  సచివాలయంలో గేటు మార్పు కూడా ఆయన సూచన మేరకే జరిగిందని చెబుతున్నారు. ముందే వాస్తు చూసి కట్టామంటారు..మళ్లీ కట్టాక పడగొట్టి వాస్తు కోసం గేట్లు మార్పు అంటారు. ఈ తతంగం అంతా చూస్తుంటే చంద్రబాబు రాజధాని విషయంలో ఎన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సిందే తప్ప..చెప్పలేం అని ఓ మునిసిపల్ శాఖ అధికారి వ్యాఖ్యానించారు.

The post రాజమౌళే కాదు..వాస్తు సిద్ధాంతి కూడా లండన్ వెళ్లొచ్చారు! appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

రాజమౌళే కాదు..వాస్తు సిద్ధాంతి కూడా లండన్ వెళ్లొచ్చారు!

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×