Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఐటి నిపుణులకు గుడ్ న్యూస్..హెచ్ 1వీ వీసాల పునరుద్దరణ

అమెరికా అధ్యక్షడు ట్రంప్ పట్టు సడలించారు. స్థానిక కంపెనీల ఒత్తిడికి తలొగ్గారో లేక మరో కారణమో తెలియదు కానీ మొత్తానికి భారతీయ ఐటి నిపుణులకు మాత్రం ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే అన్ని విభాగాల్లో నిలిపివేసిన హెచ్1బి వీసాల జారీని పునరుద్ధరించాలని నిర్ణయించారు. అంతే కాదు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 65 వేల హెచ్ 1 బీ వీసాలు జారీ చేయనున్నారు. అమెరికాలోని పలు ఐటి కంపెనీల్లో పనిచేసేందుకు వీలుగా అమెరికా ప్రభుత్వం హెచ్ 1 బీ వీసాలు మంజూరు చేయనుంది.

                                     ఈ వీసాలకు భారీ ఎత్తున డిమాండ్ ఉండటంతో అమెరికా కొద్ది రోజుల క్రితం వీటిపై నిషేధం విధించిన  సంగతి తెలిసిందే. ఈ వీసాల మంజూరు ప్రక్రియను 15 రోజుల్లోనే పూర్తి చేస్తామని..లేకపోతే వీసా ఫీజు కింద చెల్లించిన మొత్తాలను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో కూడా ట్రంప్ తన కఠిన వైఖరిని విడనాడి అమెరికాలోని కంపెనీల అవసరాలకు అనుగుణంగా నడుచుకునే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. తాజా నిర్ణయం మాత్రం భారతీయ ఐటి నిపుణులకు శుభసంకేతంగా భావిస్తున్నారు.

The post ఐటి నిపుణులకు గుడ్ న్యూస్..హెచ్ 1వీ వీసాల పునరుద్దరణ appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

ఐటి నిపుణులకు గుడ్ న్యూస్..హెచ్ 1వీ వీసాల పునరుద్దరణ

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×