Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కెసీఆర్ పై డీకె అరుణ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై మాజీ మంత్రి..కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ కె అరుణ సంలచన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా పాలకులు తోలు వరకే మింగితే ఇప్పుడు కేసీఆర్‌ బొక్కలు కూడా వదలడం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు.  మంగళవారం డీకే అరుణ గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘చీరలు కాల్చారని ఆరోపిస్తూ మహిళల పై కేసులు పెట్టడం అమానుషం. మహిళలపై పెట్టిన కేసులను తక్షణమే విత్‌డ్రా చేయాలి. నాసిరకం బతుకమ్మ చీరలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి.

                          దానికి బదులు మహిళల అకౌంట్లలో డబ్బులు వేయాలి. ప్రజల సొమ్మును దోచుకుంటుంటే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాష్ట్ర మహిళా లోకాన్ని అగౌరవ పరిచిన టీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు. కేసీఆర్‌ కుమార్తె, ఎంపీ కవిత ఈ చీరలే కట్టుకొని బతుకమ్మ ఆడుతుందా? ప్రతిపక్షాలను దూషించడం కాదు ముందు మీ తీరు మార్చుకోండి’ అని హితవు పలికారు.

The post కెసీఆర్ పై డీకె అరుణ సంచలన వ్యాఖ్యలు appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

కెసీఆర్ పై డీకె అరుణ సంచలన వ్యాఖ్యలు

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×