Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

సన్నీ నువ్వుకేక!

Tags: agravedeg

ఈ ఫోటో చూసిన తర్వాత ఎవరైనా ఆ మాట అనకతప్పదు మరి. ఈ మధ్య ఓ  పెద్దాయన ఎవరండి ఈ సన్నిలియోన్..మా అబ్బాయి సునీల్ గవాస్కర్ గురించి తెలుసుకుందామని నెట్ లో టైప్ చేస్తుంటే వెంటనే సన్నీలియోన్ అని వస్తోంది. ఆమె చిత్రాలను బ్యాన్ చేయాలని వాపోయాడు. ఆయన ఆవేదనలో కొంత అర్థం ఉంది. మరి కొచ్చిలో ఆమెను చూడటానికి ఈ జనాలను చూశాక..అందులో మా పిల్లలు ఉన్నారని తెలిసాక  ఏ తల్లిదండ్రులు అయినా ఎలా ఫీల్ అవుతారో. ఎవరికి కావాలండి ఆ ఫీలింగ్. మాకనవసరం..మేం సన్నీలియోన్ ను చూడాలి అనుకున్నారు. వచ్చేశారు. లేదంటే ఏమి జనం..ఏమి జనం. అయ్య బాబోయ్. సన్నీలియోన్ అంటే కుర్రకారు నుంచి పెద్దొళ్లలోనూ ఉన్న క్రేజ్ అలాంటిది మరి.

                              అంత జనం ఫ్రీగా దేశంలో ఏ రాజకీయ పార్టీ పెట్టినా రారని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. సన్నీలియోన్ కు గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ప్రజలు ఘన స్వాగతం పలికారు. సన్నీ ఒకప్పుడు పోర్న్ స్టార్. ఆ తర్వాత బాలీవుడ్ లోకి వచ్చి సినిమా లు చేస్తోంది. ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంటే ఆమె ఇప్పుడు పాపులర్ స్టార్ గా వెలుగొందుతోంది. కొచ్చిలో ఓ మొబైల్ షోరూం ప్రారంభోత్సవం  కోసం వెళ్లిన స‌న్నీని చూసేందుకు జ‌నాలు ఇసుకేస్తే రాలనంతగా త‌ర‌లి వ‌చ్చారు. ఆ జనసంద్రాన్ని చూసిన సన్ని అవాక్కయిందట. కొచ్చి ప్రజలు చూపించిన ప్రేమకు నేను ధన్యురాలిని అంటూ సోషల్ మీడియాలో ఆ ఫోటో పెట్టేసింది. ఈ ఫోటో ఇప్పుడు పెద్ద వైరల్ గా మారింది. ఈ మధ్య సన్నీలియోన్ చేసిన ఓ కండోమ్ యాడ్ కూడా పెద్ద దుమారమే రేపింది.

The post సన్నీ నువ్వుకేక! appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

సన్నీ నువ్వుకేక!

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×