గత కొన్ని రోజులుగా అన్ని పత్రికల పతాక శీర్షికల్లో డ్రగ్స్..డ్రగ్స్. ఇదే అంశం రోజూ ఓ హాట్ టాపిక్ గా మారిపోయింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరింత కొనసాగే అవకాశం ఉంది. విచారణలో వచ్చే పేర్లతో విచారణ మరింత కాలం ముందుకు సాగకతప్పదని భావిస్తున్నారు. అలాంటి తరుణంలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టర్ గా ఉన్న అకున్ సబర్వాల్ కు ఓ బెదిరింపు కాల్ రావటం కలకలం రేపింది. అదీ ఇంటర్నెట్ ద్వారా వచ్చిన కాల్ లో ఆఫ్రికా భాషలో హెచ్చరికలు రావటం పెద్ద సంచలనంగా మారింది. విచారణను ఇంతటితో ఆపివేయకపోతే ఇబ్బందులు తప్పవని ఏకంగా అకున్ సబర్వాల్ కే వార్నింగ్ ఇచ్చారు.
Related Articles
ఈ లెక్కన డ్రగ్స్ కేసు మూలాలు విదేశాలకు కూడా విస్తరించి ఉన్నాయని భావిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ ముఠా నెదర్లాండ్, ఐరోపాలోని పలు దేశాలు, అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు కెల్విన్ ద్వారానే అంతర్జాతీయ మాఫియా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు స్పష్టమైంది. దీంతో డ్రగ్స్ మాఫియా తాజాగా చేసిన ఫోన్ కాల్స్‌పై ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది.
The post అకున్ సబర్నాల్ కు బెదిరింపు కాల్స్ appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here