Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అమెరికా వెళ్ళినా,ఆడవాళ్ళను తడమటం మానలేదట!


                                                                 


                 అతనిది ఒక మానసిక రోగమట!ఇండియాలో ఉన్నంత కాలం ఆ రోగంతోనే మానసికానందం జుర్రుకున్నే వాడు కాబోలు. రైళ్ళలో, బస్సుల్లో ప్రయాణిస్తున్నపుడు తోటి ప్రయాణికురాళ్ళు ఒంటిని తడుముతూ ఆనందించటం అతని అలవాటు అంటా!మరి ఇండియాలో ఆడవాళ్ళకి చిన్న దానికి, పెద్ద దానికి కేసులు పెట్టడం అంటే సంకోచం కాబట్టి, ఇక్కడ తిట్లతో సరిపెట్టి ఉంటారు. మరి అమెకాలో ఊరుకుంటారా? ఊరుకోను గాక ఊరుకోరు కాబట్టి కేసు పెట్టి, కోర్టు కీడ్చి మరీ తొమ్మిది నెలలలు జైలు శిక్ష వేయించండమే కాక మూడు లక్షలు పై చిలుకు ఫైన్ కట్టేలా చేయించించింది   ఆ అమెరికా ఇల్లాలు.

   ఆయన ఒక ఇండియన్. వయస్సు46 సంవత్సరాలు. అమెరికాలో సాప్ట్వేర్ కన్సల్టెంట్. జూన్ 11,2011    సంవత్సరంలో ఆయన విమానం లో  షికాగో వెళ్తునాడు. ప్రక్కనే ఒక వ్రుద్ద జంట తమ 36 వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని లాస్ వేగాస్ వెళుతున్నారట.ఆ జంటలోని బార్య వయస్సు అరవైమూడు సంవత్సర్రాలు. ఆమె ఈ సాఫ్ట్ వేర్ కన్సల్టెంట్ ప్రక్క సిట్లో కూర్చుంది. పాపం ఈ మానసిక రోగికి ప్రక్కన ఎవరైన స్తిలు ఉంటే మనసాగదు కాబోలు. వారు యువతులైనా సరే, ముసలి వారు అయినా సరే, స్త్రీ అయితె చాలు. టచ్ చేసే దాక చేయి ఆగి చావదు మరి! ఏం చేస్తాడు? ముచ్చటగా మూడు సార్లు తడిమాడట ఆ అమ్మమ్మ గారిని. ఆమె గారు మొదటసారి ఎదో పొరపాటు అనుకుని ఉంటుంది. రెండవసారి వార్ణింగ్ ఇచ్చింది. ఇక మూడవసారీ తడిమేసరికి చిర్రెత్తుకోచ్చి పోలిస్ కేసు పెట్టిందట. మరి అమెరికా కోర్టులంటే ఇండియాలో మాదిరి ఉదారత చూపించవు కాబట్టి, సాఫ్ట్ వేర్ కంసల్టేంట్ గారికి, చాచి కొట్టినట్లైంది.తొమ్మిది నెలలు జైలు శిక్ష, మూడులక్షల ఇరవై వేలు జరిమానా, శిఖ్షా కాలం పూర్తీ కాగానే అమెరికా వదలి వెళ్ళాలని హుఖుం జారీ చేసారట అక్కడి జిల్లా జడ్జ్ గారు. అదీ కద!

   కొంతమంది మగవాళ్ళకి ఈ, ఆడవాళ్లని తడిమి ఆనందించే మానసిక  రోగం ఏమిటో అర్దం కాదు. ఇంట్లో రంభ లాంటి భార్య ఉన్నా వారిని హగ్ చేసినా  రాని ఆనందం, వీదీలో, ఎలా  ఉన్న వారైనా  సరే,వారిని టచ్ చేస్తూ, మానసికానందం అనుభవించేస్తూ ఉంటారు. అలా పరాయి స్త్రీలను టచ్ చేసేటప్పుడు వారికి పరువు మర్యాద ఇవేవి గుర్తుకు రావు. అంత మైమరచిపోతుంటారు. ఇది కేవళం విద్య లేని వారో, అల్లరి చిల్లరగా తిరిగే వారో మాత్రమే చేస్తున్నారు అనుకోవటానికి వీల్లేదు. గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న వారికి, బాగా చదువుకున్న వారికి ఈ జబ్బు ఉందని అనేక సంఘటణలు ద్వారా తెలుస్తుంది. మరి దీనికి తగిన మందు ఏమిటంటే ,ఇదిగో ఇలా  అమెరికా అమ్మమ గారు ఏమి చేసిందో అదే పనిని బాదిత స్త్రీలు చెయ్యాలి. ఒక వేళ తమకు తెలిసిన వారే అటువంటి పనిని చేస్తే నిస్సంకోచంగా ఆ విషయం ఆ మానసిక రోగికి, అతని ఇంట్లోని వారికి చెపితే పలితం ఉంటుంది. ఇటువంటి మానసికరోగులు కూడ తమకు ఉన్నది ఒక జబ్బేనని గ్రహించి, సైక్రియాటిస్ట్ ని కన్సల్ట్ చేస్తే రోగ విముక్తులు కావచ్చు.
          పరువు ప్రతిష్టలు కు బంగం కలుగుద్దన్న భయం చాలా మంది మగవాళ్ళని ఈ మానసిక రోగాన్ని కంట్రోల్ లో పెట్టుకునేటట్లు చేస్తుంది. చిన్న దానికి పెద్దదానికి గొడవ ఎందుకులే అనే స్త్రీలలోని సహన గుణాన్ని, ఈ మానసిక రోగులు,అలా టచ్  చెయ్యడం వారికి కూడా ఆనందమేలే అని అపోహ పడుతుంటారు. అందువల్ల రోగం బాగా ముదర బెట్టుకుని చివరకు ఏదో ఒక నాడు, పై న చెప్పిన సాఫ్ట్ వేర్ కన్సల్టెంట్ మాదిరి నవ్వుల పాలవుతూ ఉంటారు. ఇందులో కొస మెరుపు ఏమిటంటే సదరు మానసిక రోగి గారు ఇదే తరహ కేసులలో గతం లో అమెరికా లో బుక్కయ్యడట ! అందుకే "నీకు ఇండియా యే కరెక్ట్" అని జైలు నుంచి డైరెక్ట్ గా ఇండియాకి పంపిస్తారట!

                                  (Republished Post.13/9/2013)

               


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

అమెరికా వెళ్ళినా,ఆడవాళ్ళను తడమటం మానలేదట!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×