Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!





                                       ప్రపంచం లో వెల్లివిరుస్తున్న  మై చాయిస్ కల్చర్ లో భాగం అయినటువంటి "సింగిల్ పేరెంట్ " సిస్టం ఇండియాలో  కూడా వ్యాప్తి చెందుతుంది అనడానికి  ఉదాహరణ  నటుడు తుషార్ కపూర్ తండ్రి అయిన  విధానం . సింగిల్ పేరెంట్ విధానం అంటే పుట్టిన పిల్ల లేక పిల్లవాడికి  తల్లితండ్రులు ఉండరు. తల్లి లేక తండ్రి మాత్రమే ఉంటారు. ఇదెలా అంటే పెండ్లి అంటే ఇష్టం లేని వారు, అపోజిట్ సెక్స్ మీద ఇంట్రస్ట్ లేనివారు , లెస్బియన్, గే సంబంధాలు పట్ల అనురక్తి కలవారు , తమలో సహజంగా కలిగే సంతాన వాంఛా , తద్వారా వంశాభివృద్ధి చేసుకోవాలనే కోరికను నెరవేర్చుకోవడానికి , ఆధునిక వైద్య శాస్త్రం అందించే సర్రోగసి లాంటి విధానాలు ను పాటించి  తల్లి లేక తండ్రిగా తమ పిల్లలను ఈ భూమి మీదకు తీసుకువస్తున్నారు. అలా సర్రోగసి విధానం ద్వారానే తనకు కొడుకు పుట్టాడని సంతోషంగా ట్విట్టర్ లో ప్రకటించాడు నటుడు నిర్మాత అయినా తుషార్ కపూర్ అనే బాలీవుడ్ నటుడు.

  థి డర్టీ పిక్చర్ నిర్మాత అయినా శ్రీ తుషార్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు జీతెంద్ర , శోభా కపూర్ ల కుమారుడు. నిర్మాత ఏక్తా కపూర్ కు స్వయానా సోదరుడు . మరి మీకు   సింగిల్ పేరెంట్ గా కొడుకును పొందాలని ఎందుకు అనిపించింది  అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటో తెలుసా?  ఆయన ఒక సారి ప్లయిట్ లో దర్శకుడు ప్రకాష్ జా తో కలసి ప్రయాణం చేస్తుంటే , ఆ దర్శకుడే ఈ సింగిల్ పేరెంట్ మరియు సర్రోగసి విధానం గురించి చెప్పాడు ఆట. అంటే కాదు తానే దగ్గరుండి సర్రోగసి కి సహకరించే కుటుంబాన్ని పరిచయం చేయడమే కాక , పిండప్రవేశం  మొదలు  కొడుకు పుట్టే దాకా అన్నీ  దగ్గరుండి చూశాడట. చివరకు కొడుకు పుడితే  "లక్ష్య " అనే నామకరణం కూడా ప్రకాష్ జా గారే చేసినట్లు0ది.

     సరే , ఏదో సినిమాకి అంటే డైరెక్షన్ చేయడం లో అర్థం ఉంది కానీ, ఇలా తుషార్ కపూర్ గారిని సింగిల్ పేరెంట్ గా మార్చడం లో ఆయనకు ఉన్న ఇంట్రెస్ట్ ఏమిటో అర్థం కావడం లేదు. బహుశా తుషార్ కపూర్ అందరిలా పెండ్లి చేసుకుని పిల్లలు కనడం ప్రకాష్ జా గారికి ఇష్టం లేదేమో? వారిద్దరి మధ్య చెక్కు చెదరని దృఢమైన సంబంధం ఎధొ ఉండబట్టే ఇలా తుషారకపూర్ ఆయన గారి దర్శకత్వం లో ఇలా  " అలీ లేని అబ్బ కి అమ్మ లేని బాబు" అనే ఎపిసోడ్ లో నటించి విజయవంతంగా "లక్ష్యా "న్ని సాధించాడు. దీనికి జీతెంద్ర కపూర్ ప్యామిలీ బహుత్ ఖుషి  ఆట.ఈ సింగిల్ పేరెంట్ సాధించిన ఘన విజయానికి అందరూ కాంగ్రేట్స్ అంటున్నారట.

    మరి అంతా బాగానే ఉంది కానీ , రేపు లక్ష్య పెరిగి పెద్దవాడై అందరికి మల్లె తాను పొందాల్సిన మాతృత్వపు ప్రేమకు నన్ను  ఎందుకు దూరం చేసావు డాడీ అంటే ఈ సింగిల్ పేరెంట్ ఏమి జవాబు చెపుతాడు? ఈ  ప్రపంచం లో సింగిల్ పేరెంట్ లకేనా హక్కులు? వారికి పుట్టే బిడ్డలకు ఉండే సహజ హక్కుల మాటేమిటి? మానవ  సమాజానికి , జంతు సమాజానికి ఉండే గీతలు చెరిపేస్తున్న ఈ  "మై చాయిస్ " వాదులకు , పిల్లలకు ఉండే పేరెంట్స్ ప్రేమ ను పొందే హక్కును కాల రాసే అధికారం ఎవరు  ఇచ్చారు?  చట్టాలు చేసే చట్ట నిర్మాతలు ఆలోచన చేయాలి. ఇటువంటి విపరీతపుపోకడలను నిషేదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

      పిల్లలకు తల్లితండ్రుల ప్రేమను పొందడం అనేది జన్మ హక్కు. దానిని పుట్టకతోనే కాలరాస్తున్న ఈ ఆధునిక రాక్షస సంస్కృతిని ఇండియాలో నిషేదించాలి. లేకుంటే జంతువులకు మనకు తేడా ఏముంది?



This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×